Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ తొలి జాబితా ఖరారు
By: Tupaki Desk | 10 Oct 2018 8:37 AM GMTతెలంగాణ ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ సమరశంఖం పూరించింది. 34 మందితో తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఖరారు చేసింది. ఈ జాబితాలోని ఎక్కువమంది.. సీనియర్ నేతలు - మాజీ మంత్రులు - సిట్టింగ్ ఎమ్మెల్యేలే. మహాకూటమి ఖరారైన నేపథ్యంలో.. పొత్తులకు ఇబ్బందులు తలెత్తకుండా - పక్కాగా తమకే దక్కే అవకాశాలున్న స్థానాలకే కాంగ్రెస్ ఈ జాబితాలో చోటుకల్పించింది. ఈ నెల 12న యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీతో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఆ సమావేశం అనంతరమే పార్టీ అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించే అవకాశముంది.
ఇటీవలే టీఆర్ ఎస్ నుంచి తిరిగి సొంతగూడు కాంగ్రెస్‌కు చేరుకున్న కొండా సురేఖ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై నెలకొన్న సందిగ్ధతకు కాంగ్రెస్ తొలి జాబితా తెరదించింది. సురేఖ తన పాత నియోజకవర్గం పరకాల నుంచే బరిలో దిగుతారని తేలింది. గత ఎన్నికల్లో ఆమె వరంగల్ తూర్పు స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. మరోవైపు, నర్సంపేట నుంచి కూడా కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డే బరిలో దిగనున్నారు. జనగామ నుంచి మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పోటీ ఖరారైంది.
కాంగ్రెస్ ఖరారు చేసిన తొలి జాబితా ఇదే..
సబితా ఇంద్రారెడ్డి - మహేశ్వరం
కార్తీక్ రెడ్డి - రాజేంద్రనగర్
రేవంత్ రెడ్డి - కొడంగల్
గండ్ర వెంకటరమణరెడ్డి - భూపాలపల్లి
కొండా సురేఖ - పరకాల
పొన్నాల లక్ష్మయ్య - జనగామ
కూన శ్రీశైలంగౌడ్ - కుత్బుల్లాపూర్
సుధీర్ రెడ్డి - ఎల్బీనగర్
ప్రతాప్ రెడ్డి - షాద్‌నగర్
షబ్బీర్ అలీ - కామారెడ్డి
సుదర్శన్ రెడ్డి - బోదన్
శ్రీధర్ బాబు - మంథని
మహేశ్వర్ రెడ్డి - నిర్మల్
జీవన్ రెడ్డి - జగిత్యాల
బలరాంనాయక్ - మహబూబాబాద్
దొంతి మాధవరెడ్డి - నర్సంపేట
గీతారెడ్డి - జహీరాబాద్
దామోదర రాజనర్సింహ - ఆందోల్
జానారెడ్డి - నాగార్జునసాగర్
ఉత్తమ్ కుమార్ రెడ్డి - హుజూర్ నగర్
ఉత్తమ్ పద్మావతి - కోదాడ
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - నల్గొండ
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి - మునుగోడు
సురేష్ షెట్కర్ - నారాయణ్ ఖేడ్
రమేష్ రాథోడ్ - ఖానాపూర్
పొన్నం ప్రభాకర్ - కరీంనగర్
సునీతాలక్ష్మారెడ్డి - నర్సాపూర్
వంశీచందర్ రెడ్డి - కల్వకుర్తి
డీకే అరుణ - గద్వాల
సంపత్ - ఆలంపూర్
ఆరేపల్లి మోహన్ - మానకొండూరు
చిన్నారెడ్డి - వనపర్తి
జగ్గారెడ్డి - సంగారెడ్డి
భట్టి విక్రమార్క - మధిర
ఇటీవలే టీఆర్ ఎస్ నుంచి తిరిగి సొంతగూడు కాంగ్రెస్‌కు చేరుకున్న కొండా సురేఖ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై నెలకొన్న సందిగ్ధతకు కాంగ్రెస్ తొలి జాబితా తెరదించింది. సురేఖ తన పాత నియోజకవర్గం పరకాల నుంచే బరిలో దిగుతారని తేలింది. గత ఎన్నికల్లో ఆమె వరంగల్ తూర్పు స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. మరోవైపు, నర్సంపేట నుంచి కూడా కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డే బరిలో దిగనున్నారు. జనగామ నుంచి మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పోటీ ఖరారైంది.
కాంగ్రెస్ ఖరారు చేసిన తొలి జాబితా ఇదే..
సబితా ఇంద్రారెడ్డి - మహేశ్వరం
కార్తీక్ రెడ్డి - రాజేంద్రనగర్
రేవంత్ రెడ్డి - కొడంగల్
గండ్ర వెంకటరమణరెడ్డి - భూపాలపల్లి
కొండా సురేఖ - పరకాల
పొన్నాల లక్ష్మయ్య - జనగామ
కూన శ్రీశైలంగౌడ్ - కుత్బుల్లాపూర్
సుధీర్ రెడ్డి - ఎల్బీనగర్
ప్రతాప్ రెడ్డి - షాద్‌నగర్
షబ్బీర్ అలీ - కామారెడ్డి
సుదర్శన్ రెడ్డి - బోదన్
శ్రీధర్ బాబు - మంథని
మహేశ్వర్ రెడ్డి - నిర్మల్
జీవన్ రెడ్డి - జగిత్యాల
బలరాంనాయక్ - మహబూబాబాద్
దొంతి మాధవరెడ్డి - నర్సంపేట
గీతారెడ్డి - జహీరాబాద్
దామోదర రాజనర్సింహ - ఆందోల్
జానారెడ్డి - నాగార్జునసాగర్
ఉత్తమ్ కుమార్ రెడ్డి - హుజూర్ నగర్
ఉత్తమ్ పద్మావతి - కోదాడ
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - నల్గొండ
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి - మునుగోడు
సురేష్ షెట్కర్ - నారాయణ్ ఖేడ్
రమేష్ రాథోడ్ - ఖానాపూర్
పొన్నం ప్రభాకర్ - కరీంనగర్
సునీతాలక్ష్మారెడ్డి - నర్సాపూర్
వంశీచందర్ రెడ్డి - కల్వకుర్తి
డీకే అరుణ - గద్వాల
సంపత్ - ఆలంపూర్
ఆరేపల్లి మోహన్ - మానకొండూరు
చిన్నారెడ్డి - వనపర్తి
జగ్గారెడ్డి - సంగారెడ్డి
భట్టి విక్రమార్క - మధిర