Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ తొలిజాబితా ఇదేన‌ట‌! ఢిల్లీ ముద్రే ఆల‌స్యం!

By:  Tupaki Desk   |   31 Oct 2018 5:33 AM GMT
కాంగ్రెస్ తొలిజాబితా ఇదేన‌ట‌! ఢిల్లీ ముద్రే ఆల‌స్యం!
X
రోజులు కాదు వారాల‌కు వారాల త‌ర‌బ‌డి చేసిన తెలంగాణ మ‌హా కూట‌మి క‌స‌ర‌త్తు ఒక కొలిక్కి వ‌చ్చింది. కొన్ని నెల‌ల ముందు నుంచే తెర వెనుక మ‌హాకూట‌మికి సంబంధించిన పొత్తుల చ‌ర్చ‌లు జోరుగా సాగుతూ.. పొత్తు క‌న్ఫ‌ర్మ్ చేసుకోవ‌టం ఒక ఎత్తు అయితే.. సీట్ల కేటాయింపుల విష‌యంలో మొద‌ట్నించి ఒక క్లారిటీ ఉన్నా.. దానిపై ఏదో జ‌రుగుతున్న‌ట్లుగా బిల్డ‌ప్ ఇస్తూ.. జాబితాను వెలువ‌డ‌కుండా మ‌హాకూట‌మి పార్టీలు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా తెలుస్తోంది.

సీట్ల స‌ర్దుబాట్ల లెక్క‌ల ఎపిసోడ్‌ను అదే ప‌నిగా సాగ‌దీసిన మ‌హాకూట‌మి ఎట్ట‌కేల‌కు.. ఒక కొలిక్కి వ‌చ్చిన‌ట్లుగా లీకులు ఇస్తున్నారే త‌ప్పించి.. ఇప్ప‌టికి దానిక మీద క్లారిటీ ఇవ్వ‌ని ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ త‌న అభ్య‌ర్థుల‌కు సంబంధించిన తొలి జాబితాను సిద్ధం చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. కాంగ్రెస్ తొలా జాబితా అంటూ గ‌డిచిన నెల రోజులుగా వారానికి రెండు చొప్పున జాబితాలు విడుద‌ల అయ్యాయి. నిజానికి.. ఈ లిస్టులో ఉన్న పేర్ల‌లో చాలావ‌ర‌కూ క‌న్ఫ‌ర్మ్ గా టికెట్లు ఇచ్చే ప్ర‌ముఖులే. మొత్తం 119 స్థానాల్లో 90కి త‌గ్గ‌కుండా కాంగ్రెస్ పోటీ చేసే ప‌రిస్థితి ఉంది. ఇందులో 54 పేర్ల‌తో తొలిజాబితాను సిద్ధం చేసిన‌ట్లుగా స‌మాచారం.

తాము సిద్ధం చేసిన తొలి జాబితా అనుమ‌తి కోసం ఢిల్లీ అధికానాయ‌క‌త్వానికి పంపిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ జాబితాలో ప‌ది మంది త‌ప్పించి.. మిగిలిన వారంతా ప‌క్కాగా సీట్లు కేటాయించాల్సిన అభ్య‌ర్థులే ఉన్నారు. ఆ ప‌ది మందిలో కూడా కొన్ని స్థానాలు మ‌హాకూట‌మి ఖాతాలోకి వెళ్లాల్సిన‌వి ఉన్నాయి.

అయితే..త‌మ అభ్య‌ర్థులే ఎట్టి ప‌రిస్థితుల్లో బ‌రిలోకిదిగాల‌ని.. గెలుపు ప‌క్కా అన్న మాట‌తో కొన్ని సీట్ల‌ను కాంగ్రెస్ తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.అయితే.. అధికారిక జాబితాలు కాక‌పోవ‌టంతో.. ఇందులో ఎంతోకొంత మార్పులు ఉండే వీలుంద‌ని చెబుతున్నారు. మ‌రోవైపు.. తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన 54 మంది జాబితా ప‌క్కా అని.. తెలంగాణ కాంగ్రెస్ క‌మిటీ స్క్రీన్ చేసి ఓకే చేసిన అభ్య‌ర్థులతో కూడిన జాబితాను ఢిల్లీ పంపిన‌ట్లుగా చెబుతున్నారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారంగా ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ ప‌బ్లిష్ చేసిన ఈ 54 మంది అభ్య‌ర్థులు ఎవ‌రంటే..