Begin typing your search above and press return to search.
ఉత్తమ్ కు కనీసం మరో అయిదేళ్లు గడ్డం తప్పదా?
By: Tupaki Desk | 9 Dec 2018 4:19 AM GMTతెలంగాణకు రెండో ముఖ్యమంత్రి ఎవరు? టీఆర్ ఎస్ గెలిచి కేసీఆర్ మళ్లీ సీఎం కుర్చీలో కూర్చుంటారా? లేదంటే అంచనాలను తలకిందులు చేస్తూ ప్రజా కూటమి గెలిచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా సీఎం అవుతారా? తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశమంతా ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న ఇది. ఒక వేళ రెండు పక్షాలకూ సరిపడా మెజారిటీ రాకపోతే పరిస్థితి ఏంటన్నదీ చర్చనీయాంశంగా మారుతోంది. అయితే... రాజకీయాల్లో తలపండినవారు - తటస్థ విశ్లేషకులు మాత్రం టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడడానికి అన్ని అవకాశాలూ ఉన్నాయన్న వాదన వినిపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే గడ్డం తీస్తానన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి శపథం ప్రకారం ఆయనకు మరో అయిదేళ్లు గడ్డం బాధ తప్పేలా లేదు.
టైమ్స్ నౌ - ఆరా - ఇండియాటుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే టీఆర్ ఎస్ ది స్పష్టమైన విజయం. లగడపాటి రాజగోపాల్ లెక్కల ప్రకారం ఓటమి. ఇక న్యూస్ ఎక్స్-ఐటీవీ-నేతా సర్వే ప్రకారం 57 సీట్లు టీఆర్ ఎస్ కు వస్తాయి. అంటే నమ్మకమైన మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
ఇక రిపబ్లిక్ టీవీ.. సీ ఓటర్ తో కలిసి చేసిన సర్వే 48 నుంచి 60 సీట్లు అంచనా వేసింది. ఇదే చానల్.. జన్ కీ బాత్ తో కలిసి చేసిన సర్వేలో 50 నుంచి 65 అంచనా వేసింది. ఇందులో కనిష్ఠ సంఖ్య 48 సీట్లే వస్తాయనుకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీఆర్ ఎస్ కు 13 సీట్లు కావాలి. అప్పుడు కూడా ఎంఐఎం 7(అన్ని సర్వేల అంచనా), ఇండిపెండెంట్లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం సులభమే.
అయితే.. 48 కంటే తక్కువ సీట్లు వస్తే ఏంటి పరిస్థితి అనే చర్చ కూడా ఉంది. కానీ, టీఆర్ ఎస్ కు 48 కంటే తక్కువ వచ్చినా కూటమికి 60 దాటి వస్తాయన్న నమ్మకం లేదు. కారణం.. ఎంఐఎంకు 7 సీట్లు అందరి అంచనా. ఇక బీజేపీకి కూడా కనీసం 5 వస్తాయని అనుకుంటున్నారు. 7గురు ఇండిపెండెంట్లది పక్కా విజయం అని అన్ని పార్టీలూ అంగీకరిస్తున్నాయి. అంటే... ఈ మూడు కలిపి 19 సీట్లు ఉంటాయి. మిగిలిన 100 సీట్లలో టీఆర్ ఎస్ - కూటమి అభ్యర్థులే గెలవాలి. కూటమికి 55 కంటే ఎక్కువ సీట్లు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్తితి లేదు. కారణం.. బీజేపీ - ఎంఐఎంలు దానికి మద్దతివ్వవు. అలాగే.. సీపీఐ భాగస్వామిగా ఉన్న కూటమికి సీపీఎం నుంచి గెలిచినవారు మద్దతిచ్చే పరిస్థితి లేదు. సీపీఎంకు రెండు స్థానాలు గ్యారంటీ అని భావిస్తున్న నేపథ్యంలో ఇదీ కీలకమే. రామగుండంలో టీఆర్ ఎస్ రెబల్(ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుతో) పోటీ చేసిన అభ్యర్థి గెలిచినా ఆయన మద్దతూ కాంగ్రెస్ కు ఉండదు. కారణం.. ఆయనది టిక్కెట్ విషయంలో తప్ప టీఆర్ ఎస్ తో ఎలాంటి విభేదం లేదు. దీంతో కాంగ్రెస్‌కు ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ ఇండిపెండెంట్లు మద్దతిచ్చే పరిస్థితి లేదు. సో... ప్రజా కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలు చాలా తక్కువన్నది విశ్లేషకుల మాట.