Begin typing your search above and press return to search.

ఇన్నాళ్లు ఏమయ్యారు...ఎక్కడికి వెళ్లారు

By:  Tupaki Desk   |   22 Nov 2018 5:46 AM GMT
ఇన్నాళ్లు ఏమయ్యారు...ఎక్కడికి వెళ్లారు
X
తెలంగాణ ముందస్తు ఎన్నికలలో ఓట్లను అభ్యర్దిస్తు ప్రచారానికి వెడుతున్న అభ్యర్దులను తెలంగాణ ప్రజలు నిలదీస్తున్నారు ఇన్నాళ్లు తాము కనిపించలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలు - నిలదీయాడాలు అధికార పార్టీకి చెందిన కొందరి అభ్యర్దులకే పరిమితం కాగా. మహాకూటమి నుంచి పోటి చేస్తున్న అభ్యర్దులందరికీ ఎదురవుతున్నాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో తామూ ఆనందంగానే ఉన్నామని - కొన్ని చోట్ల మాత్రం ఎమ్మెల్యేల ప్రవర్తన పట్లు ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న 119 స్దానాలలో పాత బస్తి మినహాయించి మిగిలిన వాటిలో ఓ 20 మంది తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్దులపై నిరసన వ్యక్తం అవుతున్నట్లు సమాచారం. ఇక ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ - తెలుగుదేశం - భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వంలో లేనంత మాత్రన నియోజకవర్గ ప్రజల కష్టాలు పట్టావా అని ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

అధికారంలో లేని సమయంలోనే ప్రజలను పట్టించుకోవాలని - ఆ సమయంలో పట్టించుకోని నాయకులు అధికారంలోకి వచ్చాక ఏం చేస్తారని ప్రశ్నల వర్షం కురుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన జానారెడ్డి - ఉత్తమ్ కుమార్ రెడ్డి - డి.కె. అరుణ వంటి సీనీయర్ నాయకులను ప్రజలు నిలదీస్తున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు డా. లక్ష్మన్ - ఎవివిఎస్. ప్రభాకర్ - కిషన్ రెడ్డి వంటి నాయకులు సైతం ప్రచారంలో ప్రజల నుంచి నిరసనలు ఎదుర్కుంటున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదని తెలిసినా వ్యక్తిగతంగా నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేల అండ ఉంటుందని ఓటర్లు గతంలో భావించారు. అయితే భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరూ ఆయా నియోజకవర్గాల ప్రజలను సంత్రుప్తి పరచలేకపోయారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన కమలనాధులను ప్రజలు ఇవే ప్రశ్నలతో ముంచేత్తుతున్నారు. దీంతో ప్రచారానికి వెళ్లాలంటేనే అభ్యర్దులు జంకుతున్నారు. ఇక తెలుగుదేశం అభ్యర్దులైతే మరీ దారుణ స్దితి. అన్న ఎన్టీఆర్ ను చూసి ఓట్టు వేసి గెలిపించామని - తీరా గెలిచిన తర్వాత అధికార పార్టీ వైపు ఎలా వెళ్లిపోతారని ప్రశ్నిస్తున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయే వారిని ఆపలేరా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వీరిని కూడా గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన పార్టీ వైపు వెళ్లిపోతారా అని నిలదీస్తున్నారు. సహజంగా ఇలాంటి నిరసనలు అధికార పార్టీ అభ్యర్దులే ఎదురుకుంటారు. తెలంగాణలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.