Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ఓట‌మి...కొన‌సాగుతున్న పోస్టుమార్టం

By:  Tupaki Desk   |   31 Dec 2018 1:22 PM GMT
కాంగ్రెస్ ఓట‌మి...కొన‌సాగుతున్న పోస్టుమార్టం
X
ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ ఎస్ విజయదుందుభి మ్రోగించగా....మహాకూటమిగా ఏర్ప‌డి పెద్దన్నగా వ్యవహరించిన కాంగ్రెస్ ఘోర ప‌రాజ‌యం పాలైంది. అంతేకాకుండా ఆ పార్టీలోని పెద్ద తలకాయలు సైతం ఓటమి బాట పట్టారు. ఈ ప‌రాజ‌యం కాంగ్రెస్ పార్టీని కుంగ‌దీసింది.. ఈ నేప‌థ్యంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ ఛార్జీ కుంతియా పోస్టుమార్టం నిర్వహించేందుకు హైదరాబాద్‌ కు వచ్చారు.

కాంగ్రెస్ పార్టీకి అచ్చివ‌చ్చిన గోల్కోండ హోటల్‌లో కుంతియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ - రేవంత్ - దామోదర...ఇతర కీలక నేతలు హాజరయ్యారు. తక్కువ ఓట్లతో పరాజయం చెందిన వారు కూడా ఇందులో పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాలు - ఓటమికి గల కారణాలపై చర్చించారు. ఇదిలాఉండ‌గా - ఈ స‌మీక్ష సంద‌ర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల క‌మిష‌న్‌ సీఈవో రజత్ కుమార్ నిర్ణయాలపై తమకు అనుమానాలున్నాయని...రైతుబంధు పథకం డబ్బులు నేరుగా బ్యాంకులో వేయాలని రజత్ కుమార్ ఎందుకు చెప్పాలని ఓటమి అనంతరం ఇప్పుడు ప్రశ్నించారు. పార్టీ ఓటమికి మాత్రం అందరం బాధ్యులేమంటూ సెలవిచ్చారు.

తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పీసీసీ బీసీలకు న్యాయం జరిగేలా పోరాడుతామని తెలిపారు. పంచాయితీల్లో బిసీ రిజర్వేషన్ తగ్గించి ప్రభుత్వం అన్యాయం చేసింది. బీసీలకు న్యాయం జరిగేలా పోరాడుతామన్నారు. దర్మపురి - ఇబ్రహీంపట్నం - కోదాడ లాంటి తక్కువ మార్జిన్ తో ఓడిపోయిన స్థానాల్లో న్యాయపోరాటం చేస్తామన్నారు. పంచాయితీ``, పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలని చర్చించాం. ఎమ్మెల్యేలు ఇంచార్జ్ లుగా ఉంటారు. సుప్రీం కోర్ట్ ఆదేశాలు ఉన్నా.. వీవీ ప్యాడ్స్ ఎందుకు లెక్కించడం లేదో ఈసీ చెప్పాలి`` అని ఉత్తమ్ డిమాండ్ చేశారు. గెలిచి ఇరవై రోజులు అయినా కేసీఆర్.. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించకపోవడం ఆశ్యర్యం కల్గిస్తుందన్నారు.