Begin typing your search above and press return to search.
టీకాంగ్రెస్ ధర్మ సందేహం!
By: Tupaki Desk | 29 July 2018 5:52 AM GMTఏపీలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధర్మపోరాట దీక్షల పేరుతో ప్రజల్లోకి వెళ్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన ధర్మసందేహాలను ఇంకా నివృత్తి చేసుకోలేక టీడీపీతో కలిసి వెళ్లాలో వద్దో తేల్చుకోలేక మీమాంసలో ఉంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు మంచిదా... ఇతరులతో అయితే బెటరా అన్నది ఆ పార్టీలో ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. రేవంత్ రెడ్డి చంద్రబాబుతో కలిసి ప్లాన్ చేసి దిల్లీ నుంచి నరుక్కుని రావడంతో టీ కాంగ్రెస్ లో చంద్రబాబుతో పొత్తు అంశం కొలిక్కి రాని సమస్యగా మారింది. టీకాంగ్రెస్ లో ఎంతో మంది నేతలకు తెలుగుదేశం పార్టీతో రాజకీయంగా చిరకాల శత్రుత్వం ఉంది. పైగా.. చంద్రబాబుతో వ్యవహారం అంటే ఎలా ఉంటుందో రాజకీయాల్లో అందరికీ తెలిసిందే... మరోవైపు తెలంగాణలో టీడీపీ ఇప్పుడేమంత బలంగానూ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పొత్తు ఎందుకని కాంగ్రెస్ లో ఓ వర్గం అంటుంటే... చంద్రబాబుతో పొత్తు వల్ల ఎంతోకొంత లాభముంటుందన్న వాదన చేస్తున్న వారూ ఉన్నారు.
కాగా కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి టీడీపీతో పొత్తుపై ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ను ఎదుర్కొనాలంటే పొత్తులు అవసరమని కాంగ్రెస్ భావిస్తుంది. ప్రొఫెసర్ కోదండరామ్ తో ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. కోదండరామ్ పార్టీ విడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి నష్టపోక తప్పదని భావించిన కాంగ్రెస్ కొన్ని సీట్లను త్యాగం చేసుకునైనా కేసీఆర్ ను ఢీకొట్టాలని నిర్ణయించింది. మరోవైపు తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఇప్పటికీ క్యాడర్ ఉంది. ఓటు బ్యాంకు కూడా ఉంది. ముఖ్యంగా సెటిలర్ల ఓట్లు టీడీపీకి అనుకూలంగా ఉంటాయని భావిస్తుండటంతో వీరి ప్రభావం నాలుగైదు జిల్లాల్లో ఉండనుంది.
తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పాత్తుకు సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే... హైదరాబాద్ - వరంగల్ - మహబూబ్ నగర్ - నిజామాబాద్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల్లో టీడీపీతో పొత్తు కారణంగా ఎక్కువ సీట్లు త్యాగం చేయాల్సి వస్తుంది.. దాంతో ఆ ప్రాంత నేతలు పొత్తు వద్దంటున్నట్లుగా తెలుస్తోంది.