Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ దూకుడు
By: Tupaki Desk | 31 July 2018 6:57 AM GMTతెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్దమన్న కాంగ్రెస్ తెలంగాణలో సెటిలర్ల ఓట్లపై కన్నేసింది. ఇందుకోసం ఏకంగా రానున్న ఎన్నికలలో సెటిలర్లకు టికెట్లు ఇస్తామంటూ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంథీ హామీ ఇవ్వడంతో తెలంగాణలో ఉన్న ఆంధ్రులు తమ వైపునకు వస్తారని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది - ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును గద్గెదించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టపరిచేందుకు ఒకవైపు, ఇతర పార్టీలతో జతకట్టేందుకు మరో వైపు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం బూతులు వారిగా కమీటీలు కూడా వేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఆ పనిని సమర్దులైన నాయకులకు అప్పగిస్తున్నారు.
పార్టీలో గ్రూప్ తగదాలను విడనాడలని అందరూ ఐక్యమత్యంతో కష్టపడితే అధికారంలోకి రావడం ఏమంత కష్టం కాదని అగ్రనేతలు భావిస్తున్నారు. వస్తుందో రాదో తెలియని ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీని బజారుకు ఈడ్వవద్దని అధిష్టానం హేచ్చరిస్తోంది. ముఖ్యమంత్రి ఎవరూ అని తేల్చాల్సింది కాంగ్రెస్ అధిష్టానమే తప్ప నాయకులు కాదని తేల్చి చెప్తున్నారు. ఇలాంటి కఠిన వైఖరి ఒకవైపు - పార్టీని పటిష్ట పరచడం మరోవైపు చేపట్టాలని నిర్ణయించారు. కేంద్రంలో అధికారంలోకి రావలంటే ఇలాంటి వైఖరినే అవలంభించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. దీంతో ఇక మీదట ముఖ్యమంత్రి అభ్యర్దుల ప్రకటనలు వ్యక్తిగత అభిప్రాయాలకు తావివ్వరాదని నిర్ణయించారు. పార్టీ పటిష్టతలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతీ నెలా తెలంగాణాకు వస్తారని - పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రాహుల్ పర్యటనలు కేవలం హైదారబాద్ కే పరిమితం కావని - తెలంగాణలోని అన్నీ నగరాలు - పట్టాణాలు ఉంటాయని చెబుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన వాగ్దానాలు అమలు కాకపోవడంతో పాటు ఇతర ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే తెలంగాణలో వివిధ ప్రాజేక్టులలో జరుగుతున్న అవినీతిని కూడా ప్రజలలోకి తీసుకుని వెళ్లాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా "ఆ నలుగురు" పేరుతో ఒక బుక్ లెట్ తీసుకురావలని, అందులో ఈ నాలుగేళ్లలో జరిగిన అవినీతి - అక్రమాలను ప్రస్తావించాలని నిర్ణయించారు. ఇరవై నుంచి 50 లక్షాల కాపీల వరకు ముద్రించి తెలంగాణలో గ్రామగ్రామాన పంపీణి చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ సేవదళ్ కార్యకర్తలతో తెలంగాణ వ్యాప్తాంగా ప్రచారాలు, వివిధ సంఘాలతో సమావేశాలు జరపాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నెపధ్యంలో చిన్నా పెద్ద నాయకులెవ్వరు హైదారాబాద్ రావద్దని - తమతమ నియోజకవర్గాలలోనే ఉండి పార్టీ పటిష్టతకు క్రుషి చేయాలని ఆదేశలిచ్చారు.