Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ లో ఫాంహౌజ్ విందు రాజకీయాలు
By: Tupaki Desk | 7 Jan 2019 6:03 AM GMTఓ వైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిభారం...మరో వైపు పంచాయతీ ఎన్నికల కోలాహలం...ఇంకో వైపు ముంచుకువస్తున్న పార్లమెంటు ఎన్నికల న ఏపథ్యంలో...కాంగ్రెస్ పార్టీ నేతలు ఐక్యత మంత్రం జపిస్తున్నారు. వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఈ క్రమంలో విందు భేటీలకు తెరతీస్తున్నారు. అయితే, గతంలో వలే స్టార్ హోటల్లలో భేటీలు కాకుండా...ఫాంహౌజ్ విందులు సాగుతున్నాయి. తాజాగా పార్టీ సీనియర్ నేత మాజీమంత్రి డీకే అరుణ ఫాంహౌజ్ విందు ఏర్పాటుచేశారు. ఓటమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రయత్నించారు.
హైదరాబాద్ శివారులోని తన ఫాంహౌజ్ లో మాజీ మంత్రి డీకే అరుణ ఇచ్చిన విందుకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలు, గెలిచిన ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు హాజరయ్యారు. జానారెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాష్కీ, మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, జగ్గారెడ్డి, రేవంత్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న స్తబ్ధతకు తెరవేసి పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో నేతలంతా చురుగ్గా పాల్గొనేలా చేసేందుకే నేతలకు లంచ్ ను ఏర్పాటు చేసినట్లు మాజీమంత్రి డీకే అరుణ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతలంతా ఒకచోటకూర్చుని మాట్లుడుకునేందుకు ఎవరోఒకరు చొరువ తీసుకోవాలని, ఆ చొరువను తాను తీసుకున్నట్టు తెలిపారు. ఇందులో ఏ విధమైన ఇతర రాజకీయ కారణాలు లేవని పేర్కొన్నారు. ఇది విందు సమావేశం కాదన్నారు. అందరిని కలిసి మాట్లాడాలనుకుని సమా వేశం పెట్టామన్నారు. 'ఎక్కడివాళ్ళు అక్కడే ఉండటం కంటే అందరం కలుద్దాం అనుకున్నాం' అని చెప్పారు.
అన్ని జిల్లాలో పొత్తుతో లాభం ఉండదని ముందే చెప్పానని డీకే అరుణ అన్నారు. టీడీపీ బలంగా ఉన్న చోట మాత్రమే లాభం జరిగిందన్నారు. పార్లమెంట్ ఎన్నికలో పొత్తులతో లాభం ఉండదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ అంశంపై చర్చ జరగలేదన్నారు. పొత్తుల వల్లే ఓడిపోయామని కాదు...ఎన్నో కారణాలు ఉన్నాయని వివరించారు. టీఆర్ఎస్ ఒక్కోచోట ఒక్కో లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ను ఓడించిందన్నారు. కంచుకోట లాంటి పాలమూరు జిల్లాలో కూడా కాంగ్రెస్ ఓటమి చూస్తేనే...ఏదో జరిగిందనే అనుమానం కలుగుతున్నదన్నారు. పార్టీ ప్రక్షాళన పై అధిష్టానం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అధిష్ఠానం తమ కుటుంబానికి అవకాశం ఇస్తే పోటీచేయడానికి సిద్ధమేనని తెలిపారు.