Begin typing your search above and press return to search.
కోదండరాంను మళ్లీ బక్రా చేసేసిన కాంగ్రెస్
By: Tupaki Desk | 23 Nov 2018 5:43 AM GMTపొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గా సుదీర్ఘకాలం సేవలు అందించి రిటైర్ అయిన తెలంగాణ జనసమితి నేత - ప్రొఫెసర్ కోదండరాంకు రియల్ పాలిటిక్స్ చుక్కలు చూపిస్తున్నాయి. అనుకున్నది ఒకటి అయింది మరొకటి అన్నట్లుగా ఆయన పరిస్థితి మారిపోయిందని పలువురు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే...ఆయన సారథ్యంలోని తెలంగాణ జనసమితి కాంగ్రెస్‌ను నమ్ముకుని ఎన్నికల బరిలోకి దూకింది. అయితే, తెలంగాణ జనసమితి నిండా మునిగింది! కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు వేసిన ఎత్తులకు బలైంది!! పొత్తులో భాగంగా ఎనిమిది స్థానాలకే రాజీపడినా అందులో నాలుగింటిలో అభ్యర్థులను బరి లో నిలిపి కాంగ్రెస్ తన అసలు స్వరూపం చూపెట్టింది.
మహాకూటమి పొత్తుల్లో భాగంగా 119 అసెంబ్లీ స్థానాలకు గాను 99 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉన్న సంగతి తెలిసిందే. టీడీపీకి 13 - టీజేఎస్ కు 4 - సీపీఐకి 3 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ రెబల్స్ ను బుజ్జగించేందుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రయత్నించింది. అయితే, టీజేఎస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మంత్రాంగం నడిపింది. ఢిల్లీ నుంచి వచ్చిన అహ్మద్ పటేల్ - కుంతియా బృందం బుధవారం అర్ధరాత్రి తీవ్రంగా ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో టీజేఎస్ ఐదుస్థానాల్లో తన అభ్యర్థులను విరమించింది. 13 స్థానాల్లో తన అభ్యర్థులను నిలిపిన టీజేఎస్ కాంగ్రెస్ ఒత్తిడితో మహబూబ్ నగర్ - మిర్యాలగూడ - చెన్నూరు - అశ్వారావుపేట - మెదక్ లో పోటీ నుంచి ఉపసంహరించుకున్నది. కూటమిలో టీజేఎస్ కు మిగిలినవి వర్ధన్నపేట - అంబర్ పేట - మల్కాజిగిరి - సిద్దిపేట మాత్రమే. వరంగల్ ఈస్ట్ - దుబ్బాక - ఆసిఫాబాద్ - ఖానాపూర్ లో కాంగ్రెస్ కూడా పోటీ చేస్తున్నది. టీజేఎస్ ఐదుచోట్ల తన అభ్యర్థులను ఉపసంహరించుకుంటే కాంగ్రెస్ ఒక్క అంబర్‌పేటలోనే తన అభ్యర్థిని ఉపసంహరించింది. కనీస పొత్తుధర్మం పాటించకుండా తమ నమ్మకాన్ని కాంగ్రెస్ వమ్ముచేసిందని టీజేఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం కనికరం చూపకుండా నాలుగు సీట్లలో టీజేఎస్ కు పోటీగా తన అభ్యర్థులను నిలపడం ఏమిటని టీజేఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.
ఇదిలాఉండగా - రిటైర్డ్ ప్రొఫెసర్ కోదండరాం అంతర్గత సంభాషణల్లో తీవ్రంగా ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. ఒక చారిత్రక అవసరం కోసం కూటమిని ఏర్పాటు చేశామని, కానీ ఎన్నో అవరోధాలు - అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి స్ఫూర్తి దెబ్బతినకుండా తాము పలుచోట్ల సీట్లను త్యాగం చేశామని, కానీ కాంగ్రెస్ మాత్రం ఎలాంటి దయాదాక్షిణ్యాలు లేకుండా వ్యవహరించిందని అన్నారు. మేడ్చల్ లో శుక్రవారం జరిగే సోనియా సభకు హాజరవుతున్నానని తెలిపారు.