Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ కు ఊపిరి ఊది..గాలి తీసేసిన కొత్త స‌ర్వే

By:  Tupaki Desk   |   10 Nov 2018 7:16 AM GMT
కాంగ్రెస్‌ కు ఊపిరి ఊది..గాలి తీసేసిన కొత్త స‌ర్వే
X
ఓ వైపు మోదం..మ‌రో వైపు ఖేదం. ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి! ఓ వైపు కేసీఆర్ ఎన్నిక‌ల రంగంలో దూసుకెళ్తుంటే... మ‌హాకూట‌మి ఏర్పాటు - సీట్ల పంప‌కం...అభ్య‌ర్థుల బుజ్జ‌గింపుతో కాంగ్రెస్ పార్టీ స‌త‌మ‌తం అయిపోతోంది. పైగా ఇప్ప‌టికి ఆరు స‌ర్వేలు విడుద‌ల అయితే అన్నీ కేసీఆరే మ‌ళ్లీ సీఎం అని చెప్పాయి. కారు జోరు కొన‌సాగుతుంద‌ని తేల్చిచెప్తుండ‌టం కాంగ్రెస్ నేత‌ల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది. ఇలా రెండు వైపులా ఇబ్బందిక‌ర ప‌రిణామాల‌తో ఇర‌కాటంలో ప‌డుతున్న స‌మ‌యంలో, కాంగ్రెస్ అనుకూల మీడియా నిర్వ‌హించిన స‌ర్వేలో మ‌హాకూట‌మి వైపు మొగ్గు అని ఓ స‌ర్వే వ‌చ్చింది. అయితే... హెడ్డింగ్ చూసి సంతోష‌ప‌డేలోపు అందులో కూడా కాంగ్రెస్‌ కు షాకింగ్ న్యూస్ త‌గిలింది.

తెలంగాణ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించే అవకాశం ఉన్న‌ట్లు ఏబీపీ న్యూస్‌ - రిపబ్లిక్‌ టీవీ కోసం సీ-వోటర్‌ (సెంటర్‌ ఫర్‌ ఓటింగ్‌ ఒపీనియన్స్‌ అండ్‌ ట్రెండ్స్‌) చేసిన సర్వే తేల్చింది. అయితే... అందులో పెద్ద మెలిక ఏంటంటే... సీఎం ఎవ‌రు కావాల‌ని కోరుకుంటున్నార‌ని జ‌నాల్ని అడిగితే... మ‌ళ్లీ కేసీఆర్ సీఎం అయితే బాగుంటుంద‌ని చెప్పిన‌ట్లు అందులో ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. ఇది ఆ పార్టీ నేత‌లకు మింగుడుప‌డ‌టం లేదు. మా మ‌ద్ద‌తు మీడియా స‌ర్వే చేసినా ఇలా రావ‌డ‌మా అని ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ట‌. ఇక రేవంత్ రెడ్డి కేసీఆర్‌ ను ఎదుర్కొనే మొన‌గాడు అని అటు తెలుగుదేశం నేత‌లు - కాంగ్రెస్ నేత‌లు ప‌లికేవి కూడా కేవ‌లం ప్ర‌గ‌ల్భాలు అని ఈ స‌ర్వేలో తేలింది. స‌గానికి పైగా కేసీఆర్‌ కు మ‌ద్ద‌తు ప‌లికితే కేవ‌లం ఏడు శాతం మాత్ర‌మే రేవంత్‌ కు జై అన్నారు. అంటే రేవంత్ కేసీఆర్‌ కు చాలా దూరంలో ఆగిపోయారు.

సర్వేలో పాల్గొన్న‌వారిలో మొత్తం 42.9 శాతం మంది కేసీఆరే సీఎం కావాలని కోరుకోవ‌డం విశేషం. 27 శాతం మంది ఇంకా తేల్చుకోలేదు అని చెప్పారు. 22.6 శాతం మంది జానారెడ్డిని అయినా ఓకే అన్న‌ట్లు చెప్పారు.

ఈ స‌ర్వే నేనే సీఎం అనుకుంటున్న కాంగ్రెస్ నేత‌లు ప‌లువురికి శ‌రాఘాతమే. ఒక్క జానారెడ్డి పేరు మాత్రమే క‌నీస ప‌రిగ‌ణ‌లో ఉంది. ఇక ఉత్త‌మ్ అయితే అడ్ర‌స్ లేదు. ఇక ఆయ‌న ప్ర‌చారం జ‌నాల‌కు ఏం ఎక్కుతుంది? అనుకూల స‌ర్వే వ‌చ్చినా వారి ఆనందం క్ష‌ణాల్లో ఆవిరైపోయింది. ఇది బ‌హిరంగంగా ప్ర‌క‌టించుకున్న సీఎం అభ్య‌ర్థుల‌కే కాదు...కాంగ్రెస్‌లోని ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌కు సైతం జీర్ణించుకోలేని విధంగా మారిపోయింది.

కేసీఆర్ ఇంకా పూర్తిగా ప్ర‌చార‌మే చేయ‌లేదు. ఒక నాలుగు స‌భ‌లు పెట్టి... నిర్ణ‌యాలు నావి - న‌న్ను న‌మ్మండి...మీకు మ‌రిన్ని అద్భుతాలు చేసి చూపిస్తాను అని కేసీఆర్ గ‌ట్టిగా చెప్పాడంటే... జ‌నం కారెక్క‌డం గ్యారంటీ అని అర్థం చేసుకోవచ్చు.