Begin typing your search above and press return to search.
కూటమిలో సీట్ల పితలాటకం..22 సీట్లకే ప్యాకప్!
By: Tupaki Desk | 21 Oct 2018 2:30 PM GMTమహాకూటమిలో సీట్ల సర్దుబాటు అంశంలో బేరసారాలు కొనసాగుతున్నాయి. కూటమిలో సీట్లు ఇచ్చేవారు పుచ్చుకునేవారు ఉండరని, అందరూ సమానమేనని కాంగ్రెసేతర పక్షాలు అంటున్నప్పటికీ - కాంగ్రెస్ పార్టీయే పెద్దన్న పాత్రను పోషించటం స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం 22 సీట్లతోనే మిత్రపక్షాలను ప్యాకప్ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోందని అంటున్నారు. తెలుగుదేశం - టీజేఎస్ - సీపీఐ పార్టీలు ఇచ్చిన జాబితాల్లో ఉన్న సంఖ్యను తగ్గించుకోవాలని కోరటం మినహా ఏయే స్థానాల నుంచి ఎవరు పోటీ చేయాలనే స్పష్టత అధికారికంగా రానప్పటికీ ఈ ప్రతిపాదన సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మహాకూటమిలోని నేతల అభిప్రాయం ప్రకారం తెలుగుదేశం పార్టీ 27 స్థానాలతో కూడిన జాబితా ఇవ్వగా 12 లేదా 13 స్థానాలకే పరిమితం కావాలని కాంగ్రెస్ కోరుతోంది. 17 సీట్లు కేటాయించాలని తెలంగాణ జనసమితి నేత కోందడరాం కోరుతుండగా ఆ పార్టీ కోరుతుండగా 8 లేదా 9 సీట్లకు పరిమితం కావాలని కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు తెలిసింది. సీపీఐ కూడా మొదట 12 స్థానాలు కోరింది. రాహుల్ గాంధీ రాక నేపథ్యంలో జరిగిన చర్చల్లో ఆ పార్టీ 6 స్థానాలు కోరినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ 2 లేదా 3 సీట్లకు పరిమితం కావాలని సూచించింది. స్థూలంగా 22 సీట్లలోపే మిత్రపక్షాలను ఇవ్వడం ఉద్దేశంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కాగా, సీట్ల జాప్యంపై విభిన్నమైన వాదన తెరమీదకు వస్తోంది. సీట్ల సర్దుబాటు విషయంలో మరింత జాప్యం చేయటం ద్వారా టీడీపీ - టీజేఎస్ - సీపీఐ తమ స్థానాల సంఖ్యను తగ్గించుకుంటాయనే భావన కూడా కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి - ఏఐసీసీ కార్యదర్శి కుంతియా పార్టీ నేతలతో సమావేశం అయి తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొంటున్నారు. కాగా, సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇక్కడ తేలకపోతే నేరుగా ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ కోర్ కమిటీతో చర్చలు జరపాలని మిత్రపక్షాలు భావిస్తున్నాయి.