Begin typing your search above and press return to search.
టీ కాంగ్రెస్ కు అద్భుతమైన ఐడియా వచ్చింది
By: Tupaki Desk | 18 Jun 2017 8:11 AM GMTదాదాపు 60 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమానికి తెరదింపి తెలంగాణ రాష్ట్ర కాంక్షను సాకారం చేసినప్పటికీ ఓట్లు కొల్లగొట్టుకోవడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు కనిపిస్తోంది. పోయిన చోటే వెతుక్కోవాలనే చందంగా...తనకు ఒకనాడు పెట్టని కోటగా, గట్టి ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతంగా పేరున్న తెలంగాణలో పునర్ వైభవం సంపాదించే ఎత్తుగడలను సిద్ధం చేసింది. తాజాగా ఇందుకోసం యువనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని రంగంలోకి దింపుతోంది. ఇప్పటికే ఇటీవల సంగారెడ్డిలో రాహుల్ గాంధీతో ప్రజాగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించి తమ సత్తాను చాటిన కాంగ్రెస్ పార్టీ మరోమారు రాహుల్ అండగా రాష్ట్రంలో దూకుడుగా వెళ్లేందుకు సిద్ధమైంది.
తెలంగాణలో బలపడేందుకు రాహుల్ గాంధీని నమ్ముకోవాలని కాంగ్రెస్ పార్టీ భావించినట్లు కనిపిస్తోంది. ఇటీవల రాహుల్ సభతో పార్టీ నేతల్లో ఉత్సాహం వచ్చిన నేపథ్యంలో మరోమారు ఆయన కేంద్రంగా పార్టీ బలోపేతానికి తెలంగాణ పీసీసీ స్కెచ్ వేసింది. రంజాన్ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ సందేశ్ యాత్ర నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది. గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన పీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి - బలోపేతం చేసేందుకు గల అవకాశాలు ఇందుకు అనుసరించాల్సిన కార్యాచరణ వంటి అంశాలను చర్చించారు. కాంగ్రెస్ నేతలు ఇంటింటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకెళ్ళాలన్న సూచన మేరకు రాహుల్ సందేశ్ యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. రంజాన్ తరువాత తొలుత జిల్లా స్థాయిలో, అనంతరం నియోజకవర్గ స్థాయిలో రాహుల్ సందేశ్ యాత్రలో భాగంగా సమావేశాలు ఏర్పాటు చేయాలని కార్యవర్గంలో ఉత్తమ్ ప్రకటించారు.
క్షేత్రస్థాయిలో సమావేశాల సందర్భంగా కూడా రాహుల్ గాంధీ కేంద్రంగా ప్రచారం సాగాలని ఉత్తమ్ వివరించారు. ఇటీవల సంగారెడ్డిలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలను వివరించాలని తెలిపారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వంపై సంగారెడ్డి సభలో విడుదల చేసిన ఛార్జ్‌షీట్‌ను కూడా పంపిణీ చేయాలని సూచించారు. ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించాలని, రాష్ట్ర ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో ఉన్న వ్యతిరేకతను ఈ పర్యటన కేంద్రంగా చాటిచెప్పాలని వెల్లడించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/