Begin typing your search above and press return to search.
గాంధీ భవన్ కు టులెట్ బోర్డ్ రెడీ చేయాలా!
By: Tupaki Desk | 2 Aug 2019 5:30 AM GMTదేశంలో కాంగ్రెస్ ప్రాభవం రోజు రోజుకూ తగ్గిపోతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు మోడీ, అమిత్ షాలు అన్ని రకాల వ్యూహాలతో ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తూ ఉన్నారు. మొన్నటి వరకూ కాంగ్రెస్ చేతిలో ఉందనుకున్న కర్ణాటక కూడా చేజారింది. ఇక నెక్ట్స్ జాబితాలో మధ్యప్రదేశ్, రాజస్తాన్ లు ఉన్నాయనే మాట వినిపిస్తూ ఉంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఉన్న రాష్ట్రాల్లో కూడా కథ మారిపోతోందని పరిశీలకులు అంటున్నారు. అలాంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిలుస్తూ ఉంది. అయితే ఇటీవలే కేసీఆర్ ధాటికి ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ చాపకింద నీరులా ప్రవేశిస్తూ ఉంది. ఇప్పటికే తెలంగాణలో చాలా మంది కాంగ్రెస్ నేతలు భారతీయ జనతా పార్టీలోకి చేరిపోయారు.
మరింతమంది కూడా ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే హైదరాబాద్ లోని కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ కు టు లెట్ బోర్డు పెట్టాల్సి రావొచ్చని పరిశీలకులు అంటున్నారు. ఒకప్పడు గాంధీ భవన్ అంటే ఉమ్మడి ఏపీ రాజకీయాన్ని శాసించింది. ఇప్పుడు అది వెలవెలబోతూ ఉంది. అక్కడకు వెళితే టీ ఇచ్చే నాథుడు కూడా లేడని కాంగ్రెస్ నేతలు వాపోతూ ఉన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగడం పార్టీ ని మరింతగా డ్యామేజ్ చేస్తూ ఉందని వారు అంటున్నారు.