Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ తొలి జాబితా సిద్ధం...!?
By: Tupaki Desk | 21 Sep 2018 4:38 AM GMTముందస్తుకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ దగ్గర పడడంతో అన్ని అస్త్రాలు సంధించేందుకు ముందుకురుకుతోంది. ఎన్నికల కమిటీలను ప్రకటించిన అధిష్టానం ఇప్పుడు అభ్యర్ధుల జాబితాపై కసరత్తు ప్రారంభించింది. తెలుగుదేశం - తెలంగాణ జన సమితి - వామపక్షాలతో కలిసి మహాకూటమిగా ఏర్పాటయ్యేందుకు సన్నాహాలు చేస్తూనే తన పని తాను చేసుకుపోతోంది. మహాకూటమిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు - ఎవరికి ఎంత ప్రాధాన్యం వంటి అంశాలపై చర్చిస్తూనే తాము పటిష్టంగా ఉన్న స్ధానాల్లో అభ్యర్ధుల ఎంపిక కూడా ప్రారంభించినట్లు సమాచారం. తమ సిట్టింగులందరికీ ముందుగా టిక్కట్లు ఇవ్వాలని - దీని ద్వారా గతంలో తాము గెలిచిన స్ధానాలు తమ వద్దే ఉంచుకోవాలన్నది కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. దీనిని ద్రష్టిలో ఉంచుకునే పొత్తుల విషయంలో జాగ్రత్తలు పాటించాలంటూ పార్టీ నాయకులకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. దీంతో ముందుగా తమ సిట్టింగులకు టిక్కట్లు ఇవ్వడంపై ఎలాంటి సంశయాలు ఉండవని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. అలాగే 2009 సంవత్సరంలో విజయం సాధించి ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిన వారికి కూడా టిక్కట్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.
గడచిన రెండు రోజులుగా టిక్కట్ల ఖరారుపై తెలంగాణ కాంగ్రెస్ అగ్రనాయకులు పార్టీ తెలంగాణ బాధ్యుడు ఖుంతియాతో సమావేశమైనట్లు సమాచారం. అలాగే తెలంగాణలో పార్టీ పరిస్ధితిపై పూర్తి అంచనా ఉన్న నాయకుడు గులాం నబీ అజాద్ తో కూడా సమావేశమై తొలి జాబితాను రూపొందించినట్లు చెబుతున్నారు. ఈ జాబితాలో ముందుగా 40 నుంచి 50 మంది అభ్యర్ధులున్నట్లు చెబుతున్నారు. ఇందులో సిట్టింగులతో పాటు పార్టీ సీనియర్లు కూడా కొందరున్నారని అంటున్నారు. ఇతర పార్టీల లాగ పార్లమెంటు సభ్యులను శాసనసభకు....శాసనసభ సభ్యులను లోక్ సభకు పంపించాలనే సంప్రదాయానికి స్వస్తి పలకాలన్నది రాహుల్ గాంధీ ఆలోచనగా చెబుతున్నారు. దీనికి అనుగుణంగానే అభ్యర్ధుల జాబితా కూడా రూపొందించినట్లు సమాచారం. ఈ జాబితాను ఢిల్లీకి కూడా పంపించినట్లు చెబుతున్నారు. అధిష్టానం నుంచి అధికారిక ముద్ర వచ్చిన తర్వాత తొలి జాబితాను ప్రకటిస్తారని పార్టీలో చెబుతున్నారు. ఈలోగా పొత్తులపై కూడా స్పష్టత వస్తుందని - తొలి జాబితా అనంతరం వ్యూహాలను రచించాలని పార్టీ సీనియర్లు భావిస్తున్నారని అంటున్నారు.