Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు.. ఈసారి గట్టివాళ్లే..
By: Tupaki Desk | 12 March 2019 8:45 AM GMTలోక్ సభ ఎన్నికల నగరా మోగడంతో ఎంపీ అభ్యర్థుల ఎంపికలో తలమునకలైంది తెలంగాణ కాంగ్రెస్. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేలా అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా గతంలో చేసిన పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా అభ్యర్థులను ఎంపిక చేయాలని తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన కొందరు ముఖ్యనాయకులు కాంగ్రెస్ హైకమాండ్ పై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన సీనియర్లంతా తాజాగా అధిష్టానానికి లేఖ రాసినట్లు తెలిసింది.
ఆ లేఖలో పోయిన సారి వలే తెలంగాణలో వార్ వన్ సైడ్ కాకుండా చూడాలని..టీఆర్ ఎస్ ఆధిపత్యాన్ని చెక్ చెప్పడానికి సామాజిక కోణంతోపాటు గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానానికి లేఖలో విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
కాంగ్రెస్ సీనియర్లు ప్రతిపాదించిన ఎంపీ అభ్యర్థుల లిస్ట్ ప్రస్తుతం మీడియాకు లీక్ అయ్యింది. వారు వీరేనని ప్రచారం జరుగుతోంది. ఆ 17మంది..
1. హైదరాబాద్- ఫిరోజ్ ఖాన్
2. సికింద్రాబాద్ -అంజన్ కుమార్ యాదవ్
3. మల్కాజ్ గిరి - రేవంత్ రెడ్డి
4. జహీరాబాద్ -షబ్బీర్ అలీ
5. మెదక్ - సునీతా లక్ష్మారెడ్డి
6. వరంగల్ - అద్దంకి దయాకర్
7. మహబూబాబాద్ -సీతక్క
8. భువనగిరి - కోమటిరెడ్డి వెంకటరెడ్డి
9. నల్గొండ -జానారెడ్డి
10. మహబూబ్ నగర్ - డీకే అరుణ
11. నాగర్ కర్నూల్ - దామోదర రాజనర్సింహా (లేదా) సతీష్
12. ఖమ్మం - రేణుకా చౌదరి (లేదా) నామా నాగేశ్వరరావు
13. నిజామాబాద్ -మధు యాష్కీ
14. కరీంనగర్ - జీవన్ రెడ్డి (లేదా) పొన్నం ప్రభాకర్
15. పెద్దపల్లి - కే. సత్యానారాయణ
16. చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్ రెడ్డి
17. ఆదిలాబాద్ - రమేశ్ రాథోడ్
తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో వీరినే బరిలోకి దింపాలని.. అప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ సత్తా చాటుతుందని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానానికి లేఖ పంపినట్లు సమాచారం. ఇందులో ఉన్న వారంతా కాంగ్రెస్ ఉద్దండులు కావడంతో ఈసారి టీఆర్ ఎస్ తో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.