Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లిస్ట్‌ ను అలా త‌యారు చేస్తార‌ట‌!

By:  Tupaki Desk   |   7 Oct 2018 5:02 AM GMT
కాంగ్రెస్ లిస్ట్‌ ను అలా త‌యారు చేస్తార‌ట‌!
X
ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయ‌టం.. ఆ వెంట‌నే 105 మంది అభ్య‌ర్థుల్ని ఖ‌రారు చేయ‌టం టీఆర్ ఎస్ అధినేత‌గా కేసీఆర్ కు మాత్ర‌మే చెల్లింది. దాదాపుగా నెల రోజులుగా ఆయ‌న పార్టీ అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. నేటికీ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫు బ‌రిలో నిలిచేదెవ‌రు? టికెట్లు ఎవ‌రికి రానున్నాయి? అభ్య‌ర్థులుగా బ‌రిలో ఎవ‌రు నిల‌వ‌నున్నారు? అన్న క్వ‌శ్చ‌న్ల‌కు స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి.

ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయాల‌న్న నిర్ణ‌యం తీసుకున్న గంట‌ల వ్య‌వ‌ధిలోనే 119 మంది స‌భ్యులుండే అసెంబ్లీ ఎన్నిక‌లకు పార్టీ అభ్య‌ర్థులుగా ఎంపిక చేసిన కేసీఆర్ పెను సంచ‌ల‌నాన్నే సృష్టించారు. అభ్య‌ర్థుల్ని ఫైన‌ల్ చేసే విష‌యంలో కేసీఆర్ ఇంత దూకుడుగా ఉంటే.. కాంగ్రెస్ మాత్రం మ‌హాకూట‌మి అంటూ ఇప్ప‌టికి ఒక క్లారిటీకి రాలేని ప‌రిస్థితి. కూట‌మిలోని మిత్రుల‌కు ఎన్ని సీట్లు ఫైన‌ల్ చేయాల‌న్న లెక్క ఇప్ప‌టికి తేల‌ని ప‌రిస్థితి.

ఈసారి ఎన్నిక‌ల్లో అధికారం చేతికి రావాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న కాంగ్రెస్ బ‌రిలోకి దింపే అభ్య‌ర్థులంతా బ‌ల‌మైన వారినే త‌ప్పించి.. ఓడే అవ‌కాశం ఉన్న వారికి టికెట్ ఇవ్వ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఇంత‌కీ కాంగ్రెస్ అభ్య‌ర్థుల జాబితా ఎప్పుడు ప్ర‌క‌టిస్తార‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం కాంగ్రెస్ అభ్య‌ర్థుల జాబితా ఈ నెలాఖ‌రులోపే వ‌స్తుంద‌ని చెబుతున్నారు.

మ‌రోవైపు.. అలాంటిదేమీ లేద‌ని.. అభ్య‌ర్థుల జాబితాను ఈ నెల రెండో వారంలోనే విడుద‌ల చేస్తామ‌న్న మాట వినిపిస్తోంది. తాజాగా టీపీసీసీ చీఫ్ నేతృత్వంలో ప్ర‌దేశ్ కాంగ్రెస్ ఎన్నిక‌ల క‌మిటీ తొలిసారి గండిపేట‌లోని ఒక రిసార్ట్‌ లో శ‌నివారం భేటీ అయ్యింది. ఇందులో పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల బాధ్యుడు ఖుంటియాతో పాటు జాతీయ పార్టీ కార్య‌ద‌ర్శులు.. పార్టీ సీనియ‌ర్లు ఈ స‌మావేశానికి హాజ‌రయ్యారు.

ఈ సంద‌ర్భంగా టికెట్ల కేటాయింపు ఎలా ఉండాల‌న్న దానిపై హాట్ హాట్ గా చ‌ర్చ జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. కుటుంబానికి ఒక్క టికెట్ మాత్ర‌మే కేటాయించాల‌ని.. గెలుపు గుర్రాల‌కే అవ‌కాశం ఇవ్వాల‌న్న మాటపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగిన‌ట్లుగా చెబుతున్నారు. కూట‌మిలోని మిత్రుల‌తో సీట్ల స‌ర్దుబాటు లెక్క ఒక కొలిక్కి తీసుకురావాల‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. అభ్య‌ర్థుల ఎంపిక‌లో పార్టీ ప‌ట్ల విధేయ‌త‌.. గెలిచే స‌త్తా ఉన్న వారికే ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని.. కుటుంబానికి ఒక్క సీటు మాత్ర‌మే కేటాయించాలంటున్నారు. పొత్తులు ఉన్న‌ప్ప‌టికీ పార్టీకి చెందిన బ‌ల‌మైన అభ్య‌ర్థులు గెలిచే అవ‌కాశం ఉన్న వారి సీట్లు కోల్పోకూడ‌ద‌న్న మాట‌పై ఎక్కువ‌సేపు చ‌ర్చ జ‌రిగిన‌ట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. కుటుంబానికి ఒక్క సీటు మాత్ర‌మే కేటాయించాల‌న్న కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇదే నిర్ణ‌యానికి కాంగ్రెస్ ఎంత‌మేర క‌ట్టుబ‌డి ఉంటుందో చూడాలి.