Begin typing your search above and press return to search.

ఏ ఆశతో బరిలోకి దిగుతున్నారు సార్

By:  Tupaki Desk   |   11 March 2018 6:11 AM GMT
ఏ ఆశతో బరిలోకి దిగుతున్నారు  సార్
X
తెలంగాణలో రాజ్యసభకు సంబంధించి మూడు సీట్ల కోసం ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉన్న బలాబలాల బట్టి ఈ మూడు సీట్లు కూడా అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి దక్కే అవకాశం మెండుగా ఉంది. అభ్యర్థులను ఎంపిక చేయడంలో కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. సీట్లు గెలుచుకునే వారి వ్యవహారం ఈ రకంగా ఉంటే - ఓటమి తప్పదని తెలిసినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ తరఫున తాను సోమవారంనాడు నామినేషన్ వేయబోతున్నట్టు పార్టీ సీనియర్ నాయకుడు - గిరిజన వర్గానికి చెందిన బలరాం నాయక్ ఉన్నాయని ప్రకటించారు

ఇంతకు కాంగ్రెస్ పార్టీ ఏ నమ్మకంతో ఈ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు అందరికీ ఇదే సందేహం కలుగుతోంది. వారికి ఉన్నది మహా అయితే 12 సీట్లు. విప్ జారీ చేయడం ద్వారా జన్మించిన వారిని కూడా బెదిరించి ఓట్లు వేయించుకున్న అనుకున్నప్పటికీ కూడా - 21 సీట్లు మించి లేవు.

ఇలాంటి నేపథ్యంలో విజయానికి అవసరమైన 40 ఎమ్మెల్యేల ఓట్లను తాము పొందగలనని కాంగ్రెస్ ఎలా భావించిందో అర్థం కావడం లేదు. తెరాస వ్యతిరేక పార్టీలు అందరి ఓట్లను బతిమాలి వేయించుకున్నా సరే మరో నాలుగైదు ఓట్లకు మించి వారికి దక్కే అవకాశం లేదు. మజ్లిస్ మద్దతు కూడా తాము పొందుతామని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు కానీ , ఓవైసీ చాలా ముందుగానే తాము గులాబీకి ఓట్లు వేయనున్నట్లు గా ప్రకటించేశారు.

ఇలాంటి నేపథ్యంలో ఏదో అభాసుపాలు అవడం తప్ప కాంగ్రెస్ ఎన్నికలలో దిగడం వలన ప్రయోజనం లేదని పలువురు అనుకుంటున్నారు. తెరాసకు ఏకపక్షంగా మూడు రాజ్యసభ సీట్లు ఎన్నిక లేకుండా దక్కడాన్ని అడ్డుకోవడం తప్ప, కాంగ్రెస్ పోటీ చేయడం వలన సాధించేది మరేమీ లేదని అందరూ అనుకుంటున్నారు. కాంగ్రెస్కు కూడా ఆ క్లారిటీ ఉంది.

కాకపోతే ఇలాంటి నేలబారు టెక్నిక్కులను ప్రయోగించడం వలన ప్రజల దృష్టిలో చులకన అవుతామనే సంగతిని వారు తెలుసుకోవాల్సి ఉంది. అసలే పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు మరింత కోపగిస్తే కనుక ముందు ముందు వారికి మరిన్ని చిక్కులు తప్పకపోవచ్చునని పలువురు భావిస్తున్నారు.