Begin typing your search above and press return to search.
కేసీఆర్ హర్టవుతే బాగోదు కదా... కమ్యూనిస్టుల కొత్త బాధ!
By: Tupaki Desk | 9 March 2022 1:30 AM GMTతెలంగాణలో రాజకీయాలు రంజుగా మారిన సంగతి తెలిసిందే. కొత్త రాజకీయ ఎత్తుగడలు, పొత్తులు పొడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు అన్ని పార్టీలు క్షేత్రస్థాయి కార్యక్రమాలతో బిజీబిజీగా ఉండగా మరోవైపు ప్రజల మూడ్ తెలుసుకునే వ్యూహకర్తలు సైతం రంగంలోకి దిగిన తీరు స్పష్టమవుతోంది.
ఇలాంటి సమయంలో జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల వామపక్ష పార్టీలకు దగ్గర అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే, ఈ పరిస్థితి కమ్యూనిస్టు నేతలను ఇరకాటంలో పడేసిందని అంటున్నారు.
ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన విషయంలోకి వెళితే... పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలోని సింగరేణి ఆర్జీ 3 పరిధిలో ఉన్న అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్ట్ (ఏఎల్‌పి) గనిలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బొగ్గు కూలింది. ఒక అధికారి, ఇద్దరు కార్మికులు మృతిచెందారు.
ప్రమాదంలో గల్లంతైన ఏడుగురిలో ఇవాళ ఉదయం వరకు ముగ్గురిని బయటకు తీశారు. మరికొందరి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో సీపీఐ ఈ అంశంపై విడుదల చేసిన ప్రకటన ఆసక్తికరంగా ఉందంటున్నారు.
సింగరేణి బొగ్గుగనిలో జరిగిన ప్రమాదంలో ఒక అధికారి, ఇద్దరు కార్మికులు మృతి చెందడం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సింగరేణి బొగ్గు గనులలో వరస ప్రమాదాలు జరుగుతుండటంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.
``బాధిత కుటుంబాలను ముఖ్యమంత్రి, సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పరామర్శించి, ధైర్యం చెప్పకపోవడం సమంజసం కాదు. గతం లో సింగరేణిలో ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘటన స్థలానికి వచ్చి బాధితులకు ఓదార్చే వారు.
భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి` అని చాడ వెంకట్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అయితే, పోరాటాలకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకొనే కమ్యూనిస్టు పార్టీ ముగ్గురు ప్రాణాలు కోల్పోయి..మరో నలుగురి పరిస్థితి విషయంలో ఆందోళనలో ఉన్నప్పుడు... గత ముఖ్యమంత్రుల గురించి తెలియజేస్తూ... ప్రస్తుత ముఖ్యమంత్రి గురించి ప్రస్తావిస్తూ... చాలా పొడిపొడిగా విడుదల చేసిన `పత్రికా ప్రకటన` చూస్తుంటే... కమ్యూనిస్టులకు ఏమైందనే చర్చ జరుగుతోంది.