Begin typing your search above and press return to search.
తెలంగాణ సీఎస్ గారి కుక్కకి అధికారిక కారు!
By: Tupaki Desk | 9 April 2017 5:38 AM GMTచేతిలో అధికారం ఉంటే ఆ హవానే వేరు. తమకున్న పవర్ ను.. బాధ్యతగా ఫీలయ్యే దాని కంటే అదో హక్కుగా ఫీలై.. వేసే యేషాలు సామాన్యులకు చిరాకు పుట్టిస్తుంటాయి. కానీ.. వాటిని పెద్దగా పట్టించుకోని వైనం చూస్తే.. అధికారం ఎంతగా తలకెక్కిసిందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. తాజాగా.. ఇలాంటి ఉదంతమే తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలో కనిపించింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి ఎస్పీ సింగ్ కు శనివారం కోసం వచ్చింది. ఎందుకంటే.. ఆయన పెంపుడుకుక్కవారిని మీడియా మిత్రులు ఫోటోలు తీయటం అస్సలు నచ్చలేదు. సీఎస్ గారి కుక్కను ఫోటోలు తీస్తే ఆయనకెందుకంత కోపం అంటే.. అక్కడ విషయం మరికొటి ఉంది మరి. రెండో శనివారం సెక్రటేరియట్ కు సెలవు. అధికారులంతా హాలీడేమూడ్ లో ఉంటారు. కానీ.. సీఎస్ ఎస్పీసింగ్ గారు మాత్రం ఆఫీస్ లో పని కోసం వచ్చారు. హాలీడే కావటంతో తనతోపాటు.. ఆటవిడుపుగా ఉంటుందన్న ఉద్దేశంతో తన పెంపుడు కుక్కగారిని కూడా వెంట తెచ్చుకున్నారు.
సెలవు రోజున పెంపుడు కుక్కతో గడపొద్దని ఎవరూఅనరు. పని ఒత్తిడితో కుక్కగారితో గడిపే టైం లేనప్పుడు.. తనతో పాటు.. తన వెంటే తన కుక్కగారిని తెచ్చుకుంటే బాగుండేది.
కానీ.. మరో కారులో.. కుక్కగారు రాజసంగా కూర్చునేలా ఏర్పాటు చేసి మరీ.. దాని బాధ్యతలు చూసుకునేందుకు మరో ఇద్దరు దాని వెంట ఉన్న వైనం చూసినప్పుడు.. జర్నలిజం పాఠాలు చదివి పాత్రికేయంలోకి వచ్చిన ప్రతిఒక్కరూ ఆసక్తిని ప్రదర్శిస్తారు. తనకు తోచించి.. తనకు నచ్చింది చేసేయటమే అలవాటుగా ఉన్న పవర్ ఫుల్ వ్యక్తులకు ఫోటోలు తీయటం అస్సలు నచ్చదు. అందుకే.. తన కుక్కగారిని ఫోటోలు తీసినమీడియా ఫోటో గ్రాఫర్ల మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/