Begin typing your search above and press return to search.
తెలంగాణలో కరోనా ట్రీట్ మెంట్ ప్యాకేజీ డిటైల్స్ ఇవే
By: Tupaki Desk | 16 Jun 2020 4:30 AM GMTఅందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివరాల్ని వెల్లడించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతకంతకూ విస్తరిస్తున్న మహమ్మారి బారిన పడిన వారు.. ప్రభుత్వం అందించే చికిత్స తీసుకోకుండా.. తమ సొంతంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరే అంశంపై కీలక నిర్ణయాన్ని తీసుకున్నది తెలిసిందే. అయితే.. కరోనా నిర్దారణ టెస్టుకు.. ట్రీట్ మెంట్ కు పేషెంట్ల వద్ద నుంచి ఎంత వసూలు చేయాలన్న అంశంపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ భారీ కసరత్తు చేసింది. తాజాగా దీనికి సంబంధించిన మార్గదర్శకాల్ని విడుదల చేసింది.
కరోనా చికిత్సకు ప్యాకేజీ మాత్రమేకాదు.. ప్యాకేజీయేతర అంశాల్లో ఎంత ఛార్జ్ చేయాలన్న దానిపై స్పష్టత ఇచ్చింది. ప్యాకేజీ కింద రోటీన్ వార్డు + ఐసోలేషన్ కు రోజుకు రూ.4వేలు వసూలు చేయొచ్చు. ఐసీయూ (వెంటిలేటర్ లేకుండా) + ఐసోలేషన్ కు రూ.7,500 మొత్తాన్ని.. ఒకవేళ ఐసీయూ వెంటిలేటర్ కమ్ ఐసోలేషన్ అయితే రోజుకు రూ.9వేలు ఛార్జి చేయనున్నారు.
ప్రభుత్వం పేర్కొన్న ప్యాకేజీలో రోగికి సీబీసీ.. యూరిన్ రొటీన్.. హెచ్ ఐవీ స్పాట్.. యాంటీ హెచ్ ఐవీ.. హెచ్ బీఎస్.. సీరం క్రియాటినైన్.. యూఎస్ జీ 2డీ ఎకో.. డ్రగ్స్.. ఎక్స్ రే.. ఈసీజీ.. కన్సల్టేషన్.. బెడ్ చార్జెస్.. భోజనం తో పాటు ప్రొసీజర్ సేవలు అందిస్తారు. ప్యాకేజీ కిందకు రాని వాటి విషయానికి వస్తే.. పీపీఈ కిట్లు.. ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్.. కోవిడ్ 19 టెస్టు.. హైఎండ్ డ్రగ్స్.. హైఎండ్ ఇన్వెస్టిగేషన్స్ (సీటీ స్కాన్.. ఎంఆర్ఐ.. పీఈటీ స్కాన్.. ఇతర ల్యాబ్ టెస్టులు) ఉన్నాయి.
ఇక.. రోగ నిర్దారణ కోసం చేసే టెస్టులకు తెలంగాణ సర్కారు చార్జీలు ఫిక్స్ చేసింది. ఇంటి వద్దకే వచ్చి శాంపిల్ సేకరిస్తే రూ.2800 ఛార్జ్ చేయొచ్చు. ఒకవేళ రోగే ఆసుపత్రికి కాని ల్యాబ్ కుకాని వస్తే అతడి వద్ద నుంచి రూ.2200 వసూలు చేయాల్సి ఉంటుంది. కరోనా చికిత్స చేసే ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వం నిర్దేశించిన ధరల్ని కనిపించేలా పెట్టాలి. ఆ మేరకు మాత్రమే ఫీజులు వసూలు చేయాలి.
రోగులు.. వారి బంధువులకు అందిస్తున్న సేవల వివరాల్ని వెల్లడించాలి. పాజిటివ్ అయినప్పటికీ.. లక్షణాలు పెద్దగా లేని వారిని .. అతి తక్కువ లక్షణాలు ఉన్న వారిని ఆసుపత్రుల్లో చేర్చుకోవ్దదు. వారిని హోం ఐసోలేషన్ కు పరిమితం చేయాలి. ఐసీఎంఆర్ అనుమతులు పొందిన ప్రైవేటు ల్యాబ్ష్.. ఆసుపత్రులు మాత్రమే పరీక్షలు నిర్వహించాలి. కరోనా చికిత్సలు.. పరీక్షలపై మార్కెటింగ్ చేసుకున్నట్లు కంప్లైంట్లు వస్తే చర్యలు ఉంటాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆసుపత్రులు వ్యవహరిస్తే వారిపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది.