Begin typing your search above and press return to search.
వైరస్ లక్షణాలు కనిపిస్తే సెలవు తీసుకోండి : డీజీపీ
By: Tupaki Desk | 11 Jun 2020 11:30 PM GMTతెలంగాణలో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ మహమ్మారి నుండి ప్రజలను కాపాడటానికి ప్రయత్నించివారే ఈ మహమ్మారి బారిన ఎక్కువగా పడుతున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 84మంది పోలీస్ అధికారులకు కరోనా సోకింది. ఇలా పోలీస్ శాఖలో రోజురోజుకు వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.
వైరస్ అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న పోలీసు ఉన్నతాధికారులు, కిందిస్థాయి సిబ్బంది విశ్రాంతి తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు ఈ మేరకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. లాక్ డౌన్ విధించిన నాటి నుంచి వైరస్ కట్టడిలో పోలీసులు నిరంతరం శ్రమిస్తున్న విషయం తెలిసిందే. ఎవరికైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే సెలవు తీసుకోవాలని డీజీపీ సూచించారు.
అలాగే, ఉన్నతాధికారులు పోలీసు సిబ్బందికి వెంటనే అనుమతివ్వాలని ఆదేశించారు.
ఇప్పటికే పోలీసు శాఖలో తొలి మరణం కూడా సంభవించింది. దయాకర్ రెడ్డి అనే పోలీసు కానిస్టేబుల్ కరోనా బారిన పడి మృతి చెందిన విషయం తెలిసిందే.కంటైన్మెంట్ జోన్లు, కరోనా చికిత్సా కేంద్రాల్లో విధుల నిర్వహణ వల్లే వీరికి కరోనా పాజిటివ్ వస్తున్నట్లు అనుమానిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన అధికారులతోపాటు వారి కుటుంబసభ్యులను హోంక్వారంటైన్ చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 4111కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 2138గా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 156 మంది ప్రాణాలు కోల్పోయారు.