Begin typing your search above and press return to search.
ఏ జిల్లా ఎన్ని జిల్లాలుగా మారుతుందంటే..
By: Tupaki Desk | 4 Oct 2016 7:22 AM GMTఒక కీలకాంశం మీద ఎన్ని మార్పులు చేయొచ్చో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతల్లో చేసి చూపిస్తున్నారని చెప్పాలి. కొత్త జిల్లాల ఏర్పాటుకు కనీసం వారం రోజులు మాత్రమే ఉన్న వేళ.. మొదట అనుకున్న 27 జిల్లాలకు రోజు వారీగా పెంచేసుకుంటూ పోవటం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పక తప్పదు. ఆదివారం 30 జిల్లాలుగా అనుకున్న స్థానే.. సోమవారం గడిచేసరికి మరో కొత్త జిల్లా తెర మీదకు రావటంతో.. మొత్తం ప్రక్రియ పూర్తి అయి.. తుది నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి తెలంగాణ రాష్ట్రం ఎన్ని జిల్లాలుగా మారనుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
ఇప్పటివరకూ జరిగిన కసరత్తు.. ఇప్పటివరకూ అనుకున్న ప్రకారం చూస్తే.. తెలంగాణ రాష్ట్రం దసరా నుంచి 31 జిల్లాలుగా మారనుంది. ఇప్పుడున్న 10 జిల్లాల స్థానే 31 జిల్లాలన్న మాట. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ కొత్త జిల్లాల జోరులో ఒక్క హైదరాబాద్ జిల్లా మినహా మిగిలిన తొమ్మిది జిల్లాలు రకరకాలుగా మారిపోనున్నాయి. అందరి ఆశల్ని.. ఆకాంక్షల్ని.. డిమాండ్లను పరిగణలోకి తీసుకొని.. కొత్త జిల్లాల విషయంలో అందరిని హ్యాపీగా ఉంచాలన్న కేసీఆర్ ఆలోచన వ్యూహాత్మకంగా సాగుతుందనటంలో సందేహం లేదు.
ఇక.. కొత్తగా వచ్చిన జిల్లాలతో తొమ్మిది జిల్లాల స్వరూపం ఎలా ఉండనుందన్న విషయాన్ని చూస్తే.. వరంగల్ ఒక్క జిల్లా ఐదు జిల్లాలుగా మారనుంది. ఇక.. కరీంనగర్.. మహబూబ్ నగర్.. అదిలాబాద్ జిల్లాలు నాలుగేసి జిల్లాలుగా మారనున్నాయి. మెదక్.. రంగారెడ్డి.. నల్గొండ జిల్లాలు మూడేసి జిల్లాలుగా అవతరించనున్నాయి. ఇక.. నిజామాబాద్.. ఖమ్మం జిల్లాలు రెండేసి చొప్పున జిల్లాలు కానున్నాయి. అంటే.. ఒక్క జిల్లా ఐదు జిల్లాలుగా.. మూడు జిల్లాలు నాలుగేసి జిల్లాలుగా.. మూడు జిల్లాలు మూడేసి చొప్పున.. రెండు జిల్లాలు రెండేసి చొప్పున కొత్తగా మారనున్నాయన్నట మాట. తాజాగా అనుకుంటున్న 31 జిల్లాలతో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన డిమాండ్లు మొత్తం తీరిపోయినట్లేనని చెప్పొచ్చు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. కొత్త జిల్లాల విషయంలో అందరి వాదనల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరిగణలోకి తీసుకొన్నారని చెప్పొచ్చు.
ఇక.. ఏ జిల్లా ఎన్ని జిల్లాలుగా మారనుందన్నది చూస్తే..
వరంగల్ : 1. వరంగల్ అర్బన్ 2. వరంగల్ రూరల్ 3. భూపాలపల్లి 4. మహబూబాబాద్ 5. జనగాం
కరీంనగర్ : 1. కరీంనగర్ 2. జగిత్యాల 3. పెద్దపల్లి 4. సిరిసిల్ల
మహబూబ్ నగర్ : 1. మహబూబ్ నగర్ 2. నాగర్ కర్నూల్ 3. వనపర్తి 4. గద్వాల
ఆదిలాబాద్ : 1. ఆదిలాబాద్ 2. మంచిర్యాల 3. నిర్మల్ 4. ఆసిఫాబాద్
మెదక్ : 1. మెదక్ 2. సిద్దిపేట 3. సంగారెడ్డి
రంగారెడ్డి : 1. రంగారెడ్డి 2. వికారాబాద్ 3. మల్కాజ్ గిరి
నల్గొండ : 1. నల్గొండ 2. యాదాద్రి 3. సూర్యాపేట
నిజామాబాద్ : 1. నిజామాబాద్ 2. కామారెడ్డి
ఖమ్మం : 1. ఖమ్మం 2. కొత్తగూడెం
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/