Begin typing your search above and press return to search.

తెలంగాణ‌: ప‌బ్లిసిటీ క్లోజ్ - గేమ్ స్టార్ట్ !

By:  Tupaki Desk   |   5 Dec 2018 12:40 PM GMT
తెలంగాణ‌: ప‌బ్లిసిటీ క్లోజ్ - గేమ్ స్టార్ట్ !
X
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచార హోరుకు బుధవారంతో తెరపడింది. సాయంత్రం ఐదు గంటలకు ప్రచార గడువు ముగిసిపోయింది. ఆ తర్వాత సభలు, సమావేశాలు నిర్వహించేందుకు వీల్లేకపోవడంతో ఎక్కడి మైకులు అక్కడే మూగబోయాయి. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలైన 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్‌ను సాయంత్రం 4 గంటలకే ముగిసింది. గడువు దాటిన తర్వాత ఎవరైనా ప్రచారం కొనసాగించినా - సభలు - సమావేశాలు - ఊరేగింపులు నిర్వహించినా కఠినచర్యలు చేపడుతామని హెచ్చరించింది. సినిమా థియేటర్లు - టీవీలు ఇతర మాధ్యమాల ద్వారా ఎన్నికల సందేశాలను ప్రసారంచేయడాన్ని నేరంగా పరిగణిస్తామ న్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలాంటి స ర్వేలను ప్రసారం చేయరాదని పేర్కొన్న ఎ న్నికల కమిషన్.. బల్క్ ఎస్సెమ్మెస్‌లనూ ని షేధించింది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో వినోదకార్యక్రమాలు, కచేరీలు నిర్వహించరాదని స్పష్టంచేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేరొన్నది.

డిసెంబర్ 7న ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 1,821 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. రాష్ట్రంలో 2,80,74,722 మం ది ఓటర్లుండగా.. 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 39,763 కంట్రోల్ యూనిట్స్ వినియోగించనుండగా... 238 మంది సాంకేతిక నిపుణులను అందుబాటులో ఉంచింది ఈసీ. ఈ ఎన్నికల్లో మొత్తం 2,80,64,684 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనుండగా... వీరిలో పురుషులు 1,41,56,182 మంది, స్త్రీలు 1,39,811 మంది, థర్డ్ జెండర్ 2,691 మంది ఓటర్లుగా ఉన్నారు. ఈవీలను ఎప్పటి నుంచి ఉపయోగిస్తుండగా... ఈ సారి కొత్తగా వీవీప్యాట్ లు ప్రవేశపెట్టారు. ఈ ఎన్నికల్లో ఫిర్యాదుల కోసం సి విజిల్ యాప్, వికలాంగుల కోసం వాదా యాప్, ఓటర్, పోలింగ్ బూత్ ల సమాచారం కోసం నా ఓటు యాప్ లు అందుబాటులోకి తెచ్చారు. ఇక కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. భద్రత కోసం 279 కేంద్ర కంపెనీల బలగాలు, 30 వేల మంది రాష్ట్ర భద్రత బలగాలు, ఇతర రాష్ట్రాల నుండి 18,860 మంది బలగాలను రంగంలోకి దింపారు. వికలాంగుల కోసం (4,57,809) వీల్ చైర్లు, బ్రెయిలి లిపిలో ఎపిక్ కార్డ్స్, సైన్ బోర్డ్స్, ర్యాంప్ లు... ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. వాదా యాప్ ద్వారా పోలింగ్ కేంద్రాలు గుర్తించవచ్చు.

కాగా, అత్యధిక పోలింగ్ స్టేషన్లు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉండగా... అత్యల్పంగా పోలింగ్ కేంద్రాలు భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నాయి. మరోవైపు అత్యధికంగా 42 మంది అభ్యర్థులు మల్కాజ్‌గిరి నియోజకవర్గం బరిలో ఉండగా... బాన్సువాడలో అత్యల్పంగా ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలైన 13 సమస్యాత్మక నియోజకవర్గాలైన 13 నియోజకవర్గాల (సిర్పూర్‌కాగజ్‌నగర్ - చెన్నూరు - బెల్లంపల్లి - మంచిర్యాల - ఆసిఫాబాద్ - మంథని - భూపాలపల్లి - ములుగు - పినపాక - ఇల్లందు - కొత్తగూడెం - అశ్వారావుపేట - భద్రాచలం) పరిధిలో బుధవారం సాయంత్రం 4 గంటలకే ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేశారు. కాగా, నేటి నుంచి ప్ర‌లోభాల ప‌ర్వం పెద్ద ఎత్తున మొద‌లుకానుంద‌ని అంటున్నారు.