Begin typing your search above and press return to search.
దావోస్ నుంచి పెట్టుబడుల మూటలతో దిగిన కేటీయార్....మరి ఏపీ....?
By: Tupaki Desk | 22 Jan 2023 1:30 AM GMTఉమ్మడి ఏపీ రెండుగా విభజించబడ్డాక తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతీ విషయంలో పోటీ వస్తోంది. అలాగే పోలిక కూడా తెస్తున్నారు. ఇది అత్యంత సహజం. రెండు రాష్ట్రాలు పరుగు పందెంలో దూసుకుపోతే ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఒక రాష్ట్ర ఎద్దుల బండి నడకతో మరో స్టేట్ జెట్ స్పీడ్ తో ముందుకు వెళ్తూంటేనే తంటా వస్తోంది.
ఏపీకి సీఎం గా చంద్రబాబు ఉన్నపుడు పోలిక ఉంది. పోటీ ఉంది. అయితే నాడు ఏపీ నుంచి చిత్తశుద్ధి లోపం లేకుండా ప్రయత్నాలు అయితే గట్టిగా సాగాయి. అదే టైం లో మెరుగైన రికార్డులు కూడా వచ్చాయి. ఇక వైసీపీ ఏలుబడిలో తీసుకుంటే రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి కబలించింది అన్నది ఒకటి ఉంది కానీ ఆ తరువాత తీసుకున్నా ప్రగతి రధం పరుగు అన్నది పెద్దగా లేదు అని పెదవి విరిచే వారు ఉన్నారు.
దానికి ప్రభుత్వ ప్రయత్న లోపం కూడా ఉంది అని అంటున్నారు. లేకపోతే దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2023కి బొట్టు పెట్టి మరీ పిలిచినా ఏపీ ప్రభుత్వం ఎందుకు వెళ్లలేదు అన్న చర్చ ఉండనే ఉంది. దీని మీద తెలుగుదేశం పార్టీ నుంచి విమర్శలు ఎటూ ఉన్నాయి. కానీ సామాన్య జనంలో కూడా సవాలక్ష సందేహాలు ఉన్నాయి. వెళ్లవచ్చు కదా అని అందరి మాటగా ఉంది. ఏపీలో మార్చిలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని మంత్రి గుడివాడ అమరానాధ్ చెప్పిన జవాబు మాత్రం ఎందుకో అతికినట్లుగా లేదు అంటున్నారు.
ఇక మరో వైపు చూస్తే తెలంగాణా ఐటీ మంత్రి కేటీయార్ దావోస్ టూర్ కి వెళ్లారు. చక్కగా సెమినార్లు సదస్సులలో పాలు పంచుకున్నారు. ఏకంగా 21 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను తన వెంట తీసుకొచ్చారు. కేటీయార్ తన పది మంది మెంబర్స్ తో దావోస్ లో టూర్ చేశారు. ఆయన నాలుగు రోజుల పాటు దావోస్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఐటీ కంపెనీ అధిపతులను కలిశారు, చర్చలు జరిపారు.
అదే విధంగా కేటీయార్ అక్కడ 52 దాఅ వ్యాపార సమావేశాలను నిర్వహించారు. అలగే ఆరు రౌండ్ టేబిల్ సమావేశాలతో పాటు, మరో రెండు ప్యానల్ డిబేట్స్ లో పాలుపంచుకున్నారు. ఇలా అన్ని రకాలుగా దోవోస్ టూర్ ని ఉపయోగించుకుని కేటీయార్ ఫుల్ సక్సెస్ అయ్యారు అని అంటున్నారు. తెలంగాణా ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం చూస్తే డబుల్ డిజిట్ నంబర్ తో వేల కోట్ల రూపాయల నిధులు వచ్చాయని అంటున్నారు.
మొత్తానికి దావోస్ టూర్ కి వెళ్ళకుండా ఏపీ ప్రభుత్వం తప్పు చేసిందా అన్న చర్చ అయితే వస్తోంది. నిజానికి ఐటీ మంత్రి గుడివాడ అమరనాధ్ ఐటీ బృందంతో వెళ్లవచ్చు. ఆయనకు అంత తీరుబాటు లేని పని ఏపీలో ఏముంది అని విపక్షాలు అడుగుతున్నాయి. దావోస్ టూర్ కి వెళ్తే ఏపీకి కూడా పెట్టుబడులు బాగా వచ్చేవి అన్న మాట ఉంది. కానీ ఏపీ సర్కార్ కానీ మంత్రి గారు కానీ దావోస్ అంటే ఎందుకో ఉలిక్కి పడుతూ దూరంగా ఉంటున్నారని, దావోస్ లో వారికి చంద్రబాబు కనిపిస్తే ఎవరేం చేయలేరు అని సెటైర్లు పడుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.