Begin typing your search above and press return to search.
కదిలే ఐసీయూ..దేశంలోనే మొదటిది..ఎక్కడో తెలుసా?
By: Tupaki Desk | 24 May 2020 6:30 AM GMTప్రస్తుతం మహమ్మారి విస్తరిస్తున్న దృష్ట్యా సేవలు అందించడం ప్రభుత్వాలకు తలకు మించిన భారమవుతోంది. ఆస్పత్రుల్లో పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. వివిధ కేంద్రాల్లో క్వారంటైన్లు ఉంచుతున్నారు. అయితే మారుమూల, గిరిజన తండాల్లో ఈ వైరస్ సోకితే వారిని ఇక్కడికి తీసుకొచ్చే వరకే ప్రాణాలు పోతుంటాయి. అక్కడి వారికి అధునాతన సేవలు అందడం లేదు.
తాజాగా ఈ వైరస్ బారిన పడిన రోగుల కోసం ఓ మొబైల్ ఐసీయూను ఏర్పాటు చేశారు. దేశంలోనే మొట్టమొదటి మొబైల్ ఐసీయూ ఇదీ.. ఈ వైరస్ బారిన పడిన రోగుల కోసం బస్సులో రెండు వెంటీలేటర్లు, మూడు పడకలతో మొబైల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ను ఒక స్వచ్ఛంద సంస్థ అభివృద్ధి చేసింది.
‘మొబైల్ కోవిడ్ -19 ఐసియు’ అని పిలువబడే ఎంసిఐసియులో వెంటిలేటర్, ఇమేజింగ్, టెలి రేడియాలజీ, ఇ-ఐసియు, అల్ట్రాసౌండ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రిస్క్ స్ట్రాటిఫికేషన్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈ మొబైల్ ఐసియులో రోగుల రక్త నమూనాలను కూడా కాంటాక్ట్‌లెస్ పద్ధతిలో సేకరించవచ్చు.
MCICU, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ కలిసి ఇతరులతో భాగస్వామ్యంతో ఈ మొబైల్ ఐసీయూని అభివృద్ధి చేశారు. ఇది వైరస్ బాగా ప్రబలిన.. అవసరమైన ప్రాంతాలలో ఉంచబడుతుంది.
ఎటువంటి సౌకర్యాలు లేని గ్రామాలు.. కొండలు, కోనలు, గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు దీన్ని ఉపాయోగిస్తారు. అధునాతన వసలుతున్న దీంతో క్లిష్టమైన సీరియస్ గా ఉన్న ప్రాణాలను కాపాడటం దీని లక్ష్యమని డెవలపర్లు తెలిపారు.
మహమ్మారి పరిస్థితిని ఎదుర్కోవడంలో ఈ సౌకర్యం ఎంతో సహాయపడుతుందని, ముఖ్యంగా దేశంలో వెంటిలేటర్ అమర్చిన పడకల కొరత ఉందని, ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు ఎక్కువగా మెట్రోలు, రాష్ట్ర రాజధానులలో కేంద్రీకృతమై ఉన్నాయని వారు భావిస్తున్నారు. అందుకే గ్రామీణ వైద్య సదుపాయం లేని ప్రాంతాలకు దీంతో సేవలు అందించనున్నారు.