Begin typing your search above and press return to search.

పాత హాల్ టికెట్లతోనే పది పరీక్షలు..సర్కార్ నిర్ణయం

By:  Tupaki Desk   |   10 May 2020 6:15 AM GMT
పాత హాల్ టికెట్లతోనే పది పరీక్షలు..సర్కార్ నిర్ణయం
X
కరోనా-లాక్ డౌన్ తో పదోతరగతి పరీక్షలు ఆగిపోయాయి. పరీక్షలు జరుగుతాయా లేదా అన్న ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది. మే 17 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలు జరిపేందుకు కసరత్తు చేస్తున్నాయి.

విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనను పరిగణలోకి తీసుకొని తెలంగాణ ఎస్సెస్సీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మార్చినెలలో విద్యార్థులకు జారీ చేసిన హాల్ టికెట్లతోనే మిగిలిన పదోతరగతి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. ఇక మొత్తం 5.34 లక్షల మంది విద్యార్థులకు గతంలో 2530 కేంద్రాలను ఏర్పాటు చేశామని.. ఇప్పుడు ఆ పరీక్షా కేంద్రాలను రెట్టింపు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నామని తెలిపారు.

హైకోర్టు నుంచి ఉత్తర్వులు రాగానే ఈ నెలాఖరులోగా పదోతరగతి పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటి నుంచి విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ కావాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో శానిటైజర్లు, మాస్కులు , భౌతిక దూరం పాటించడం నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. ప్రతి బెంచ్ కు ఒకరు కూర్చునేలానే ఏర్పాట్లు చేస్తామన్నారు. విద్యార్థికి విద్యార్థి 6 అడుగుల దూరం ఉండేలా ఎడం పాటిస్తామన్నారు.