Begin typing your search above and press return to search.
రియల్ ఎస్టేట్ రంగంలోకి తెలంగాణ సర్కార్
By: Tupaki Desk | 19 Feb 2022 3:30 AM GMTకరోనా కల్లోలంతో చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించాలంటే అవసరం ఉన్న అన్ని వనరులను వాడాలి. అందుకే రియల్ ఎస్టేట్ మీద పడింది తెలంగాణ సర్కార్. తెలంగాణలో విపరీతంగా పెరిగిన భూముల విలువను క్యాష్ చేసుకునేందుకు రెడీ అయ్యింది.
ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం వెంచర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వ భూములను వేలం వేయడంపై విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంపై హైకోర్టును కొందరు నేతలు ఆశ్రయించారు. అయితే హైకోర్టు కూడా ప్రభుత్వ భూముల వేలానికి పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే.
ఇక మరోవైపు.. రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా అడుగుపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. బ్యూటీ ఫుల్ లే ఔట్స్ , వెంచర్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. పదుల ఎకరాల్లో ప్రభుత్వ వెంచర్లు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సమాచారం.
ప్రైవేటు , అసైన్డ్ , ప్రభుత్వ భూములతో కలిసి ఈ లే ఔట్స్ ఏర్పాటు చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రైవేట్ భూములను సేకరించేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది.
మొదటగా ఈ లేఔట్స్, వెంచర్లను ఎంపిక చేసిన పట్టణాలు, నగరాల్లో ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు.తామే లేఔట్స్, వెంచర్లు ఏర్పాటు చేస్తే ప్రజలు నమ్మకంతో ప్లాట్స్ కొంటారని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పేదలు, అల్ప ఆదాయ వర్గాలకు సొంతింటి కల నెరవేరనుంది. సామాన్యులకు అందుబాటు ధరల్లోనే వీటిని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిసింది.