Begin typing your search above and press return to search.

కొత్త రెవెన్యూ చట్టం పై టి సర్కార్ దృష్టి !

By:  Tupaki Desk   |   29 Jan 2020 5:30 AM GMT
కొత్త రెవెన్యూ చట్టం పై టి సర్కార్ దృష్టి !
X
రాష్ట్ర అభివృద్ధి లో రెవెన్యూ డిపార్ట్మెంట్ కీలకంగా వ్యవహరిస్తుంటుంది. అలాగే అవినీతి ఎక్కువగా కరిగేది కూడా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనే కావడం గమనార్హం. ఇకపోతే ఈ మధ్య కాలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అవినీతి మరింతగా పెరిగిపోయింది అని చెప్పడానికే ఎన్నో సంఘటనలు జరిగాయి. అధికారులు అడిగిన లంచాలు ఇవ్వలేక , కాళ్ళకి ఉన్న చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి పెట్రోల్ బాటిల్స్ తో ఆఫీసుల్లోకి వెళ్లి బెదిరింపులకు దిగుతున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది లంచాలని తీసుకోవడం మాత్రం ఆపడంలేదు. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో అవినీతిలో అగ్రస్థానం ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ దే. కొన్ని రోజుల ముందు ఏసీబీ విడుదల చేసిన ఒక నివేదిక లో ఈ విషయం తేటతెల్లం అయ్యింది.

దీనితో తెలంగాణ సీఎం కేసీఆర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పై ప్రత్యేక దృష్టిని పెట్టినట్టు తెలుస్తుంది. ప్రజలకి అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా కొత్త రెవెన్యూ చట్టానికి తెలంగాణ సర్కార్‌ రూపకల్పన చేస్తోంది. ఈ కొత్త రెవెన్యూ చట్టం తయారీలో కీలక సూచనలు చేస్తూ సీఎం బిజీగా ఉన్నారు. తెలంగాణకు మంచి పరిపాలన అందించే లక్ష్యంగా పాలన లో కేసీఆర్‌ సంస్కరణలు చేపట్టారు. ప్రజలతో మమేకమై రెవెన్యూ వ్యవస్థలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పాలనా సంస్కరణల ద్వారా సాధించుకున్న తెలంగాణలో ప్రయోజనాలు కాపాడే చట్టాలు మాత్రమే, అమలు చేసే దిశగా కేసీఆర్‌ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రెవెన్యూ చట్టాల రూప కల్పన పై వేగం పెంచారు.

రాష్ట్రం విడిపోయిన తరువాత, పాత చట్టాలతో కొన్నీంటిని అనువదించుకోవడం మరికొన్నీంటిని మార్చేసింది. అలాగే ఇప్పుడు తెలంగాణ భూ వినియోగం, రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల ఆధారంగా కొన్ని కొత్త చట్టాలను తీసుకువచ్చేందుకు రాష్ట్ర సర్కార్‌ కసరత్తులు ప్రారంభించింది. అయితే ఇప్పటికే పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలను అమలు చేస్తోంది. తాజాగా రెవెన్యూ చట్టంని కూడా అమల్లోకి తీసుకురాబోతుంది. మిగతా చట్టాలతో పోల్చితే రెవెన్యూ చట్టం చాలా కీలకమైంది. రెవెన్యూ చట్టంలో ఏ శాఖలో లేనివిధంగా దాదాపు 150కిపైగా చట్టాలున్నాయి.కానీ , ఈ 150 లో కొన్ని పూర్తిగా ఉమ్మడి రాష్ట్రంలో మాత్రమే పనికి వచ్చే చట్టాలున్నాయని అధికారులు చెప్తున్నారు. దీనితో పనికిరాని చట్టాలని పక్కనపెట్టి ..రాష్ట్రానికి ఉపయోగపడే దాదాపు 100కు పైగా చట్టాలని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందనే నిర్ణయానికి వచ్చారు.


రెవెన్యూ చట్టం ఆధారంగా టైటిల్‌ గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ చట్టాన్ని ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం వీలుపడనప్పటికీ, మొదటగా ఫైలెట్ ప్రాజెక్ట్ గా అమల్లోకి తెచ్చి,, ఆ తరువాత క్రమంగా విధానాలపై అధ్యయనం చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని రెవెన్యూ చట్టాలన్నీంటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి రెవెన్యూ కోడ్‌ను అమలు చేయాలన్న మరో ఆలోచన కూడా ఉంది. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, బ్యాంకులు, వ్యవసాయ శాఖలన్నీంటిని ఒకేచోట పూర్తయ్యేలా చూడటం, ఒకటి, రెండు రోజుల్లోనే నిర్ణీత సేవలన్నీ రైతులకు చేరేలా చూడాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ కొత్త రెవెన్యూ చట్టం పై కసరత్తుని వీలైనంత త్వరగా పూర్తి చేసి , వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లోనే కొత్త ఆచట్టానికి ఆమోదం తెలపడానికి అన్ని పనులని చకచకా సిద్ధం చేస్తున్నారు.