Begin typing your search above and press return to search.
మందుబాబులకు కిక్ ఇచ్చే గుడ్ న్యూస్ .. ఏంటంటే !
By: Tupaki Desk | 30 Dec 2020 11:31 AM GMTన్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మద్యం దుకాణాల మూసేసే సమయంలో రాష్ట్ర సర్కార్ ఓ నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా మరో గంటపాటు తెరిచే ఛాన్స్ ఇచ్చింది. ఇప్పటి వరకు రాత్రి 11 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచే అవకాశం ఉండేంది. న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు ఓపెన్ చేసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. అలాగే , క్లబ్, బార్లకు కూడా టైమింగ్ పెంచింది. అర్ధరాత్రి ఒంటి గంట వరకు అనుమతినిచ్చింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ ఎస్‌డీ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వైన్ షాప్‌ల వద్ద, బార్‌లు, క్లబ్‌ల్లో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. ఇక, కొద్ది రోజుల క్రితం సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో పబ్‌లు, క్లబ్బులు, బార్లకు పర్మిషన్ లేదన్నారు. గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొన్నారు. స్టార్ హోటళ్లలో రోజువారీ కార్యక్రమాలకు అనుమతి ఇస్తున్నట్టు చెప్పారు. విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతామన్నారు. ఈ నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.