Begin typing your search above and press return to search.
తెలంగాణ ముఖ్యమంత్రి ముందుజాగ్రత్త ఐడియా !
By: Tupaki Desk | 21 March 2020 4:32 PM GMTభారత్ లో అలాగే, తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత అయిదేళ్లలో రిటైరైన డాక్టర్లు, నర్సులకు పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. వీరిని మూడు నెలల కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 11వేలమందికి పైగా మృతి చెందారు. దాదాపు మూడు లక్షల కేసులు నమోదయ్యాయి.
భారత్‌లో 300కు పైగా కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందారు. తెలంగాణలో ఇరవైకి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేసులు మరింతగా పెరిగితే వైద్యుల కొరత ఉండవద్దనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముందు ముందు కేసులు పెరిగినా, అనుమానితులు పెరిగినా అందుబాటులో ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.
కరోనా కేసులపై వైద్య శాఖ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికి అప్పుడు సమీక్షిస్తున్నారు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కొరత లేకుండ చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, రేపు (మార్చి 22) ప్రధాని మోడీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని సీఎం కేసీఆర్ కూడా పిలుపునిచ్చారు.