Begin typing your search above and press return to search.

జల రగడ: ‘సీమ’ ఎత్తిపోతలపై తెలంగాణ వాదన వినేందుకు సిద్దమైన ఎన్జీటీ !

By:  Tupaki Desk   |   21 Aug 2020 4:00 PM GMT
జల రగడ: ‘సీమ’ ఎత్తిపోతలపై తెలంగాణ వాదన వినేందుకు సిద్దమైన  ఎన్జీటీ !
X
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య జల వివాదం రోజురోజుకి పెరిగిపోతుంది. తాజాగా, తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ ఎత్తి పోతల పథకంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్ ‌ని ఆశ్రయించగా, కేసు రీ-ఓపెన్‌ చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ వాదనల నేపథ్యంలో, చెన్నై ‌ఎన్ ‌జీటీ దానికి అనుమతి ఇచ్చింది. కాగా, తెలంగాణకి చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పుని ఎన్జీటీ రిజర్వ్‌ చేసిన విషయం విదితమే. ఇప్పుడు స్వయంగా తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగడంతో, శ్రీనివాస్‌ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది. ఈ నెల 28న తుది వాదనలు వింటామని జస్టిస్ రామకృష్ణనన్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.

శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ కి జగన్ సర్కార్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇది కొత్తగా నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టు కాదనీ, పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేందుకే ఈ ప్రాజెక్ట్‌ నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియదాకా వెళ్ళిపోయింది ఈ ప్రాజెక్టుకి సంబంధించి. అయితే, తెలంగాణ నుంచి ఈ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ‌లోనూ పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్‌ వ్యవహారం పెను రాజకీయ దుమారానికి కారణమైన విషయం తెలిసిందే.