Begin typing your search above and press return to search.

రియల్ ఎస్టేట్ లోకి కేసీఆర్ సర్కార్ ఎంట్రీ ఇస్తోందా?

By:  Tupaki Desk   |   28 Aug 2020 5:30 PM GMT
రియల్ ఎస్టేట్ లోకి కేసీఆర్ సర్కార్ ఎంట్రీ ఇస్తోందా?
X
ఇన్నాళ్లు రియల్ ఎస్టేట్ అనేది ఒక రంగం.. అందులో లక్షల లాభాలుంటాయి. కోట్లకు పడగలెత్తిన వారు ఉన్నారు. ఇప్పుడు సంక్షోభం సమయంలో అన్నింటికంటే మెరుగైన పెట్టుబడికి సరైన మార్గం ‘భూములే.’ అందుకే కేసీఆర్ సర్కార్ కూడా రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగుతూ ఆదాయ మార్గాలను వెతకడానికి సిద్ధమవుతోందా? అంటే ఔననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఇన్నాళ్లు వ్యక్తులు, కంపెనీలు రియల్ వ్యాపారంలోకి దిగితే ఇప్పుడు ఏకంగా కేసీఆర్ సర్కార్ కూడా దిగబోతోందన్న వార్తలు మీడియాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి.

కరోనా లాక్ డౌన్ తో ఇప్పుడు వ్యక్తులు, వ్యవస్థలు, కంపెనీలకే కాదు.. రాష్ట్రాలకు కూడా ఆదాయం భారీగా పడిపోయింది. ఈ క్రమంలోనే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను రాష్ట్రాలు ఎదుర్కొంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు దమ్మిడి ఆదాయం లేక అల్లాడుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో భారీగా నిజాం కాలం నుంచి ప్రభుత్వ భూములున్నాయి. ఈ క్రమంలోనే ఆదాయం పెంచుకోవడానికి ఈ రియల్ ఎస్టేట్ రంగం బెస్ట్ అని అధికారులు కేసీఆర్ కు సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలోనే కేసీఆర్ సర్కార్ తెలివిగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వబోతోందని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

హైదరాబాద్, వరంగల్ సహా అన్ని నగరాలు, జిల్లా కేంద్రాలు.. ప్రధాన పట్టణాల్లో ప్రభుత్వమే స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాలని కేసీఆర్ సర్కార్ యోచిస్తోందట... ప్రభుత్వ భూములను గుర్తించి డెవలప్ చేసి.. అవసరమైతే ఇళ్లు కట్టించి అమ్ముతుందట. కబ్జా అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడడం.. వాటిని లాభసాటిగా మార్చేందుకు కేసీఆర్ సర్కార్ ఈ ప్లాన్ చేస్తోందని అంటున్నారు.

ఈ రియల్ వ్యాపారంతో సరసమైన ధరలకు భూములను అమ్మడం ద్వారా ప్రజలను ఆకర్షించడం.. వేలాది కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు ఆర్జించడం.. దాంతోపాటు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడడం ప్రధాన విధిగా కేసీఆర్ సర్కార్ ఈ ప్లాన్ చేస్తోందని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.