Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ లేఖ

By:  Tupaki Desk   |   16 March 2021 1:45 PM GMT
ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ లేఖ
X
ఉద్యోగులపై తెలంగాణ ప్రభుత్వం కరుణచూపింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్శంగా ఉద్యోగులకు హామీ ఇచ్చినట్టు తాజాగా ఎన్నికలు ముగియడంతో చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన ఉద్యోగులను రాష్ట్రానికి పంపించాలని ఏపీ సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.ఈ క్రమంలోనే ఏపీ సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీలో పనిచేస్తున్న క్లాస్ 3,4 ఉద్యోగులను తెలంగాణకు పంపాలని లేఖ రాయగా.. 698 మంది ఉద్యోగులు ఏపీలో పనిచేస్తున్నట్లు తెలంగాణ పేర్కొంది.

రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ఆప్షన్ ఇచ్చిన వారిని వెనక్కి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వీరంతా అనివార్యంగా ఏపీ రాష్ట్రంలో పనిచేస్తున్నారన్నారు.ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై కోర్టు కూడా ఉద్యోగుల విభజనపై ఏర్పాటైన కమిటీకి కీలక సూచనలు చేసింది.