Begin typing your search above and press return to search.
మందుబాబులకు శుభవార్త.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు రద్దు !
By: Tupaki Desk | 12 March 2020 1:30 PM GMTకరోనా వైరస్ ..ప్రస్తుతం ప్రపంచం లో ఉన్న ప్రతి రంగం పై తన ప్రభావాన్ని చూపిస్తూ వేగంగా వ్యాపిస్తుంది. కరోనా వైరస్ తో కుదేలౌవ్వని రంగం అంటూ లేదు అంటే అతిశయోక్తి కాదు, ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై కరోనా భారీగా ప్రభావం చూపిస్తుంది. ఇకపోతే తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు కరోనా వైరస్ ప్రభావం తగిలే పరిస్థితి కనిపిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను తక్షణం నిలిపివేయాలని, కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తొలిగిన తర్వాతనే మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులని పోలీసులు పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. అయితే, తాగి వాహనం నడిపే వారిని గుర్తించడానికి ఉపయోగించే బ్రీత్ ఎనలైజర్లని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కాకుండా ,
ముగ్గురు, నలుగురికి పోలీసులు వినియోగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాబట్టి కరోనా ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలో డ్రంక్ డ్రైవ్ టెస్ట్ లని కొన్ని రోజుల పాటు ఆపాలంటూ పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా ఈ అంశం తెలంగాణ అసెంబ్లీలో చర్చకు వచ్చింది. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి… డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను తాత్కాలికంగా నిలిపి వేయాలని గురువారం అసెంబ్లీ జీరో అవర్‌లో ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై ఆలోచిస్తామని అన్నారు. కరోనా భయం సాధారణ ప్రజల్లోనూ ఎక్కువైనందున ప్రభుత్వం డ్రంకెన్ డ్రైవ్ టెస్టులను రద్దు చేసే అవకాశం లేకపోలేదు.
అయితే , గత కొన్ని రోజులుగా తెలంగాణలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు రద్దు చేసినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ స్పందించారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు రద్దు చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు రద్దు చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, టెస్ట్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కరోనా భయం ఉన్నప్పటికీ టెస్టులు చేసే క్రమంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరికి వేర్వేరు స్ట్రాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ చేపడుతున్నామని వెల్లడించారు