Begin typing your search above and press return to search.
తెలంగాణకు వాల్‌మార్ట్...భారీ విస్తరణ
By: Tupaki Desk | 29 April 2017 12:46 PM GMTరిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ తెలంగాణలో అడుగు పెట్టబోతోంది. ఇండియాలో మొత్తం 50 స్టోర్లు తెరుస్తున్న వాల్ మార్ట్ కంపెనీ....అందులో పది తెలంగాణలో ప్రారంభించబోతోంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో వాల్ మార్ట్ తో తెలంగాణ ప్రభుత్వం ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. వచ్చే ఐదేళ్లలో వాల్ మార్ట్ రిటైల్ సంస్థ తెలంగాణలో 10 స్టోర్లు తెరుస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. వాల్ మార్ట్ ఒక్కో స్టోర్ లో రెండు వేల మంది చొప్పున పది స్టోర్ లలో కలిపి 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు.
తెలంగాణలో ఏర్పాటు చేయబోయే వాల్ మార్ట్ ద్వారా యువత, రైతులకు మేలు చేకూర్చే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి దొరికేలా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. మహిళా స్వయం సహాయక బృందాలు, చిన్న సన్నకారు రైతులతో కలిసి వాల్ మార్ట్ పనిచేస్తుందని మంత్రి కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో రైతులు పండించే పంటలకు మెరుగైన ధర దక్కే అవకాశం ఉంటుందన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/