Begin typing your search above and press return to search.
పనిలో నిర్లక్ష్యమా.. జీతంలో రూ.10వేలు కట్
By: Tupaki Desk | 11 Feb 2017 12:24 PM GMTఎవరెన్ని చెప్పినా.. ఎంతకూ మారని వైనం ప్రభుత్వ ఉద్యోగుల్లో కనిపిస్తుంటుంది. ఏ పనికి వెళ్లినా వారి నుంచి ‘రేపు రా’.. ‘మాపు రా’ అంటూ కాలం గడిపే మాటలు చెప్పటం మామూలే. పని చేయటానికి ఏ మాత్రం ఆసక్తిని ప్రదర్శించని ఉద్యోగులు కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయుత్తం అవుతోంది. ఉద్యోగుల్లో బాధ్యతను మరింత పెంచటానికి.. నిర్లక్ష్యం అన్నది లేకుండా చూడటానికి.. ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు వేగంగా పరిష్కరించటానికి వీలుగా.. సరికొత్త చట్టాన్ని తయారు చేసేందుకుఅవసరమైన కసరత్తు ప్రస్తుతం జరుగుతోంది.
కొత్త చట్టానికి అవసరమైన బిల్లు డ్రాఫ్టింగ్ కు ఇప్పటికే తుది మెరుగులు దిద్దినట్లుగా చెబుతున్నారు. రైటు టు సర్వీస్ యాక్ట్ బిల్లును ఈ బడ్జెట్ సమావేశాలకు సభలోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. సిటిజన్ ఛార్టర్ లో పేర్కొన్న సమయానికి పని పూర్తి చేయని ఉద్యోగి జీతం నుంచి రూ.10వేల నుంచి రూ.30వేలు కట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ బిల్లు తయారీకి నల్సార్ యూనివర్సిటీలో కసరత్తు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే.. ఉద్యోగుల్లో బాధ్యతాయుతంగా పని చేయటంతోపాటు.. సామాన్యుల పనులు వేగవంతంగా పూర్తి అవుతాయని భావిస్తున్నారు. ఈ బిల్లు తయారీలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధను ప్రదర్శిస్తున్నారు.అంతా బాగానే ఉంది కానీ.. నిర్లక్ష్యంగా కాలం గడిపేసే ప్రభుత్వ ఉద్యోగులకు తాజా ప్రయత్నం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో..?