Begin typing your search above and press return to search.

ఆర్టీసీపై ‘ఎస్మా’.. ఏం జరగబోతోంది.?

By:  Tupaki Desk   |   6 Oct 2019 12:24 PM GMT
ఆర్టీసీపై ‘ఎస్మా’.. ఏం జరగబోతోంది.?
X
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ మొదలుపెట్టిన ఆర్టీసీ సమ్మె రెండోరోజు ఉధృతంగా సాగుతోంది. సీఎం కేసీఆర్ వీరిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాల్లో చేరకపోతే జాబ్ లు కోల్పోతారని హెచ్చరిస్తున్నారు. ఎస్మా కూడా ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. ‘ఎస్మా’ చట్టంతో ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు పోతాయా? అసలు ఎస్మా చట్టం అంటే ఏమిటీ? ఇది అమలు చేస్తే ఏమవుతుందనే విషయం చాలా మందికి తెలియదు..

1981లో ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ మెయిన్ టేనెన్స్ యాక్ట్’(ఎస్మా) చట్టం తీసుకొచ్చారు. అంటే అత్యవసర సేవల నిర్వహణ చట్టం. ఈ సమ్మె ప్రకారం సమ్మెలు, బంద్ లు, హర్తాల్ వల్ల ప్రజల దైనందిన జీవితానికి ఇబ్బందులు కలిగితే ఈ అత్యవసర సేవల నిర్వహణ చట్టం ప్రభుత్వం ప్రయోగించవచ్చు. ఆరు నెలల పాటు ఈ చట్టం అమల్లో ఉంటుంది. పొడిగించవచ్చు కూడా.. ఉద్యోగులను సస్పెండ్, డిస్మిస్, జైలు శిక్ష, జరిమానా కూడా విధించే హక్కు ప్రభుత్వాలకు ఉంటుంది.

1980లో దేశంలో కార్మికుల నిరసన నేపథ్యంలో 12 పరిశ్రమల్లో సమ్మెను నిషేధిస్తూ కేంద్రం ఎస్మా ఆర్డినెన్స్ తెచ్చింది. ఆ తర్వాత చట్టం చేసింది..ఎస్మాను అతిక్రమిస్తే వారిని అరెస్ట్ చేయవచ్చు. ఉద్యోగులను ఉద్యోగం నుంచి తొలగించవచ్చు. సమ్మెలో పాల్గొన్న వారిని, ప్రోత్సహించిన వారిని జైలుకు పంపవచ్చు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమ్మెకు దిగిన వైద్యులు, ఆస్పత్రి సిబ్బందిపై ఎస్మా ప్రయోగించి తొలగించారు. 2006లో దేశంలో విమానాశ్రయ సిబ్బందిపై, 2009లో ట్రక్కు రవాణాదారులపై ఎస్మా ప్రయోగించారు. 2003లో తమిళనాడు సీఎం జయలలిత సమ్మె చేసిన 1,70,000 వేల మంది ఉపాధ్యాయులపై ఎస్మా ప్రయోగించి తొలగించింది.. ఇది దేశవ్యాప్తంగా సంచలనమైంది.

ఇలా ఎస్మాను ఆర్టీసీ కార్మికులపై ప్రయోగించడానికి తెలంగాణ సర్కారు రెడీ అవుతోంది. అదే జరిగితే వారి ఉద్యోగాలు ఊడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.