Begin typing your search above and press return to search.
ఫస్ట్ టైం...ఇవాంకా కోసం అది వాడుతున్నారు
By: Tupaki Desk | 23 Nov 2017 5:14 PM GMTహైదరాబాద్ లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఎంట్రపెన్యూర్ షిష్ సమ్మిట్ సందర్భంగా తెలంగాణ పోలీసులు చేస్తున్న భద్రతా ఏర్పాట్లు అన్నీఇన్నీ కావు. ప్రధాని మోడీ - అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా వస్తుండడంతో భద్రత భారీ ఉంది. అయితే... అమెరికా ప్రభుత్వం భద్రత విషయంలో కొన్ని అనుమానాలను రైజ్ చేసిందట. ఒకవేళ కెమికల్ అటాక్స్ జరిగితే ఎలా... వైరస్ - విష రసాయనాలతో ఎవరైనా దాడులకు తెగబడితే ఎదుర్కోగలరా అని అడిగిందట. దీంతో అలాంటి దాడులనూ ఎదుర్కొనేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఇందుకోసం హజ్మత్ అనే అత్యాధునిక వాహనాన్ని తెప్పింది. దేశంలో ఇప్పటివరకూ ఏ రాష్ట్రం ఉపయోగించని హజ్మత్ వాహనాన్ని జీఈఎస్ సదస్సులో వినియోగించబోతున్నారు. పేలుడు పదార్ధాలు - విష-రసాయన ఆయుధాలు, ప్రమాదకర బ్యాక్టీరియా - వైరస్ లను గుర్తించడమే కాకుండా.... వాటిని సులువుగా నిర్వీర్యం చేస్తుంది ఈ హజ్మత్.
నిజానికి ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ హజ్మత్ వాహనాన్ని రూ. 5 కోట్లతో ఫైర్ విభాగం కొనుగోలు చేసింది. 2009లోనే దీన్ని కొనుగోలు చేసినా జీఈఎస్ సందర్భంగా తొలిసారి హజ్మత్ ను రంగంలోకి దించుతున్నారు. అత్యంత ప్రమాదకర బ్యాక్టీరియా - వైరస్ లు - విష-రసాయన పదార్ధాలను గుర్తించి నిర్వీర్యం చేస్తుంది. అందుకోసం హజ్మత్ వాహనంలో కెమికల్ - బయోలాజికల్ - రేడియో యాక్టివ్ - న్యూక్లియర్ విభాగాల్లో అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. ఒక్కో విభాగానికి నలుగురు సిబ్బంది పనిచేస్తారు. ఆయా రంగాల్లో నిష్ణాతులు ఘటన తీవ్రతను గుర్తించి రంగంలోకి దిగుతారు. రెస్క్యూ సిబ్బందికి ప్రత్యేక దుస్తులు ఉంటాయి. ఒకవేళ కెమికల్ - బయోలాజికల్ - రేడియో యాక్టివ్ - న్యూక్లియర్ దాడులు జరిగితే సమర్ధవంతంగా తిప్పికొట్టడమే కాకుండా.... బాధితులు సులువుగా శ్వాస తీసుకోవడానికి ప్రత్యేక కిట్ ఉంటుంది. అలాగే బాధితులు తేరుకోవడానికి ప్రత్యేక గుడారాలను ఏర్పాటు చేసి చికిత్స అందజేస్తారు. ఈ వాహనంలో 32మంది రెండు షిప్టుల్లో విధులు నిర్వహిస్తారు. ఇప్పటివరకూ దేశంలో ఏ రాష్ట్రమూ ఇలాంటిది వినియోగించలేదని తెలంగాణ ఫైర్ విభాగం అధికారులు చెప్తున్నారు.