Begin typing your search above and press return to search.

కేసీఆర్ ప్లాన్.. దేశానికే మార్గనిర్ధేశం..

By:  Tupaki Desk   |   24 Feb 2019 4:24 AM GMT
కేసీఆర్ ప్లాన్.. దేశానికే మార్గనిర్ధేశం..
X
పరిగెత్తి పాలు తాగే కన్నా.. నిలబడి నీళ్లు తాగడం మేలు.. జనానికి దగ్గరలో ఉన్నది తనవితీరా ఇవ్వడం కేసీఆర్ కు అలవాటు.. అది తక్కువ మొత్తం అయినా సరే వాళ్లు సంతృప్తి పడేలా ఇస్తుంటారు. అందుకే కేసీఆర్ కు ఓట్లు పడుతున్నాయి. తిరిగి అధికారంలోకి వస్తున్నారు. దీనివెనుక చిన్న కిటుకు ఉంది.. ‘‘అదే నేరుగా లబ్ధిదారుకే ఇవ్వడం’’. ఈ స్ట్రాటజీ సూపర్ హిట్ అయ్యింది కాబట్టే ఇప్పుడు కేంద్రప్రభుత్వం కూడా రైతుబంధును కాపీ కొట్టి దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది.

కేసీఆర్ మళ్లీ మెస్మరైజ్ చేశారు. ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ కొట్టాలో తెలుసు కాబట్టే.. ఫలితాలు రాబడుతున్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే లక్ష వరకు రుణమాఫీ చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. నిన్నటి అసెంబ్లీలో దాన్ని నాలుగు సంవత్సరాల్లో నాలుగు విడతలుగా మాఫీ చేస్తానన్నారు. అంతటితో ఊరుకోలేదు. ఇందులో రైతులకు ప్రయోజనం కలిగేలా.. బ్యాంకులకు ఇవ్వకుండా ఆ సొమ్మును రైతులకే ఇచ్చేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

మామూలుగా రుణమాఫీ చేసే కొత్త ప్రభుత్వాలు రైతుల అప్పు లెక్క తీసి బ్యాంకులో ఆ డబ్బును జమచేస్తాయి. కానీ బ్యాంకర్లు.. వడ్డీ లాగేసుకొని మళ్లీ కొత్త అప్పుగా రైతు మెడకే చుడతాయి. దీంతో రుణమాఫీ అనేది అమలైనా.. రైతులకు ఊరట మాత్రం దక్కడం లేదు. అందుకే రైతుకు మేలు చేసేలా.. అదే సమయంలో బ్యాంకుల పీచమణిచేలా కేసీఆర్ మాస్కర్ స్కెచ్ వేశారు.. అదే నేరుగా రైతుకే రుణమాఫీ చెక్కు ఇవ్వడం.. నిజానికి ఇది చాలా గొప్ప ఐడియా..ఇలాంటి ఐడియాలు కేసీఆర్ కే వస్తాయి..

దీని వల్ల రెండు ప్రయోజనాలున్నాయి. కేసీఆర్ చేసే రుణమాఫీ తొలి విడత పావులా అయినా నేరుగా బ్యాంకుకు కాకుండా రైతుకు ఇస్తున్నాడు. ఆ రైతు దాన్ని సొమ్ముగా మార్చుకొని బ్యాంకు కు కట్టడంతో తిరిగి అప్పుపుడుతుంది. అదే కేసీఆర్ బ్యాంకు కు కడితే ఆ సొమ్ము వడ్డీకే పోయి అసలు రైతు మెడకు చుట్టుకుంటుంది. అందుకే ఈ లాజిక్ తెలిసే కేసీఆర్ రైతుకే నేరుగా ఇస్తున్నాడు. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు రైతు అప్పు తేరుతుంది. ఇటు బ్యాంకు బాధ ఉండదు.. కేసీఆర్ వేసిన ఈ నయా ఐడియా దేశానికి మార్గనిర్ధేశం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు ఇలాంటి గొప్ప ఐడియాలు కేసీఆర్ కు తప్ప వేరేవాళ్లకు రావంటున్నారు. ఎంతైనా కేసీఆర్ ది బుర్రే బుర్ర..