Begin typing your search above and press return to search.
కరీంనగర్ లో రెడ్ అలెర్ట్..ఇంటింటికి నిత్యవసరాల పంపిణీ
By: Tupaki Desk | 25 March 2020 8:50 AM GMTకరీంనగర్ లో కరోనా వైరస్ ప్రబలుతుండడంతో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఇక్కడ ఇండోనేషియన్లతో తిరిగిన యువకుడికి కరోనా పాజిటివ్ కేసు బయటపడడంతోపాటు అధికారులు అలెర్ట్ అయ్యారు. నగరంలో ఇండోనేషియన్ దేశస్తులు సంచరించిన ప్రదేశాలకు 100 వైద్య బృందాలను పంపి అనుమానితులకు పరీక్షలు నిర్వహించారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అధికారులతో మాట్లాడి రక్షణ చర్యలు చేపట్టారు. బయట ఊళ్ల నుంచి కూడా ఎవరూ కరీంనగర్ రాకుండా.. అక్కడి వారు బయటకు వెళ్లకుండా పోలీసులు శివారుల్లో బ్లాక్ చేశారు. కరీంనగర్- చుట్టుపక్కల రహదారులపై ఆరు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కరీంనగర్ లోకి ఎవరూ రాకుండా చర్యలు చేపట్టారు.
ఇక ఇండోనేషియన్లు తిరిగిన కలెక్టరేట్ ముందు ఏరియాను అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించి మొత్తం దిగ్బంధించారు. అక్కడ ఇండోనేషియన్లతో తిరిగిన ఒక యువకుడికి కరోనా పాజిటివ్ రావడంతో మొత్తం మందు స్ప్రే చేసి పారిశుధ్య చర్యలు చేపట్టి కాలనీ వాసులు అందరినీ ఇంట్లోనే ఉండమని బయటకు రావద్దని హెచ్చరికలు చేశారు.
ఇండోనేషియా దేశస్థులు తిరిగిన ముఖరాంపూర - కశ్మీర్ గడ్డ - భగత్ నగర్ ను రెడ్ జోన్ గా ప్రకటించిన అధికారులు అక్కడి వారు బయటకు రాకుండా వారి వారి ఇంటికే ఇంటికి 4 కిలోల కూరగాయలు - బియ్యం - ఇతర నిత్యవసరాలను అందజేశారు. ఎవరూ బయటకు రావద్దని ఇంటింటికి తామే సరఫరా చేస్తామని కలెక్టర్ తెలిపారు.