Begin typing your search above and press return to search.
తెలంగాణది తొలి అడుగా... తప్పటడుగా?
By: Tupaki Desk | 22 July 2015 9:49 AM GMT విభజన చట్టం అమలు కోరుతూ తెలంగాణ తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ పడింది. విభజన చట్టాన్ని అమలు చేయడం లేదంటూ ఎంపీ, తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్ ఒప్పందాలను ఏపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని, హైకోర్టును విభజించేలా కేంద్రాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. అయితే... వేణుగోపాలచారి వేసిన పిటిషన్ తో తెలంగాణ ఏపీతో వివాదాలపై న్యాయపరమైన తొలి అడుగు వేసిందా, తప్పటడుగు వేసిందా అన్నది చర్చనీయాంశమవుతోంది.
విభజన చట్టంలో ఉన్న లోపాల కారణంగా, రెండు ప్రభుత్వాల వైఖరుల్లో ఉన్న తేడాల కారణంగా వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇవి విప్పలేని చిక్కుముడులుగా మారుతున్నాయి. గవర్నరు, కేంద్రం కూడా ఈ విషయంలో చేతులెత్తేస్తున్నాయి. దీంతో ఎలాగూ దీనిపై కోర్టులను ఆశ్రయించకతప్పని పరిస్థితని అందరూ ఊహిస్తున్నారు. అయితే... తెలంగాణ ప్రభుత్వం ఇష్యూ బేస్డ్ గా కాకుండా విభజన చట్టం అమలు కోరుతూ పిటిషన్ వేయడం మాత్రం తప్పటడుగేనన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణ విద్యుత్, నీటి సమస్యలనే ప్రస్తావించినా విభజన చట్టం కచ్చితంగా అమలు చేయాలని సుప్రీం తీర్పు ఇస్తే అప్పుడు ఏపీ డిమాండ్ చేస్తున్న సెక్షన్ 8 వంటి అమలు చేయక తప్పని పరిస్థితి. అంతేకాదు...ఇంకా పలు అంశాల్లో తెలంగాణ ఉల్లంఘనలకు చెక్ పడుతుంది.
ఇదే పరిస్తితి ఉంటే మాత్రం ఈ పిటిషన్ ఏపీకి వరమవుతుందని కొందరు విశ్లేషిస్తుండగా.. పిటిషన్ లో విభజన చట్టం అమలునుప్రస్తావించినప్పటికీ ప్రధానంగా పేర్కొన్న సమస్యలపైనే వాదనలుంటాయని... ఆదేశాలు, తీర్పలు కూడా ప్రధానాంశాలపైనే ఉంటాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చట్టం అమలు వంటివాటిపై కోర్టు పరిశీలన ఉన్నప్పటికీ ఎలా అమలవుతుందో నివేదిక రూపంలో కోరే అవకాశముంటుందని చెబుతున్నారు.