Begin typing your search above and press return to search.
ఫారిన్ వెళ్లే విద్యార్థులకు టీకా సరే.. మరీ సమస్యకు పరిష్కారం మాటేంటి కేసీఆర్?
By: Tupaki Desk | 31 May 2021 9:30 AM GMTగతానికి భిన్నంగా తన వరకు వచ్చిన సమస్యలకు తక్షణమే పరిష్కారం వెతుకుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. రెండు వారాల క్రితం వరకు ఒకలా వ్యవహరించిన కేసీఆర్.. అందుకు భిన్నంగా ఇటీవల కాలంలో ఆయన తీరులో కొట్టొచ్చిన మార్పు కనిపిస్తోంది. కరోనా వేళ.. విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు టీకా అవసరం పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ.. అలాంటి విద్యార్థుల విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.
18 ఏళ్లకు పైబడిన వారికి టీకా వేసే కార్యక్రమానికి ఓకే చెప్పినప్పటికి.. వ్యాక్సిన్ కొరత కారణంగా 45 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే టీకా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో.. విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులతో పాటు.. వివిధ కారణాలతో ఫారిన్ వెళ్లే వారికి అక్కడి ప్రభుత్వాలు టీకా తప్పనిసరి చేయటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశంపై ఇటీవల కాలంలో మీడియాలో వార్తలు వస్తున్నాయి.
తాజాగా ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపించారు కేసీఆర్. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ వెంటనే వేసేలా మినహాయింపు ఇవ్వటమే కాదు.. ఈ అంశంపై తగిన మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. ఇదంతా బాగానే ఉన్నా.. దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సిన్ వేస్తున్న రెండు వ్యాక్సిన్లు కోవీ షీల్డ్.. కోవాగ్జిన్ లలో దేనికీ అమెరికాతో పాటు.. పలు దేశాలు గుర్తించటం లేదు. విద్యార్థులకు వ్యాక్సిన్ వేసినా.. ఆ టీకా విదేశాలు గుర్తించనప్పడు ఎలాంటి ప్రయోజనం ఉండదు.
కోవాగ్జిన్ కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు కోసం ఆ సంస్థ ఇప్పటికే దరఖాస్తు చేసుకోవటంతో పాటు.. పలు పత్రాల్ని అందజేసింది. దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం చేస్తోంది. ఆగస్టులో ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవాగ్జిన్ ను గుర్తించే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీకా వేసే విషయంలో ఎలా అయితే వేగంగా నిర్ణయం తీసుకున్నారో.. దాని గుర్తింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. మరీ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తారో చూడాలి.