Begin typing your search above and press return to search.
ఏపీ డెసిషన్ తో తెలంగాణకు హ్యాపీ
By: Tupaki Desk | 10 Jun 2016 9:25 AM GMTతెలంగాణ సచివాలయానికి కార్యాలయాల కొరత తీరనుంది. ఏపీ సచివాలయ కార్యాలయాలు - ఉద్యోగులు కొత్త రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి తరలిపోనుండడంతో తెలంగాణకు వెసులుబాటు ఏర్పడింది. రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సచివాలయాన్ని రెండుగా విభజించి రెండు రాష్ట్రాలకు కేటాయించిన సంగతి తెలిసిందే. సచివాలయంలోని ఏ - బీ - సీ - డీ బ్లాకు లను తెలంగాణ సచివాలయం వాడుకుంటుండగా, సౌత్ హెచ్ - నార్త్ హెచ్ - జే - కే - ఎల్ బ్లాకు లను ఏపీ సచివాలయం తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంది. తెలంగాణ సచివాలయం లో అధికారులు - మంత్రులు - సిబ్బంది కూర్చోవడానికి అనువైన స్థలం లేకపోవడంతో ప్రభుత్వం కొత్త సచివాలయ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనెల 27న తమ పరిధిలో ఉన్న ఎల్ బ్లాకు మినహా మిగతా బ్లాకులన్నింటినీ అప్పగిస్తామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు లేఖ రాసింది. అయితే... ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు సాధారణ పరిపాలన శాఖ - రెవెన్యూ - పురపాలక - పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయాలున్న ఎల్ బ్లాకును మాత్రం ఇప్పుడు అప్పగించబోమని అందులో పేర్కొన్నారు.
ఏపీ సచివాలయ ఉద్యోగులు - అధికారులు - సిబ్బంది ఈనెల 27 తర్వాత నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తరలివెళుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని కార్యాలయాలకు సంబంధించిన ముఖ్యమైన దస్త్రాలు - ఇతర ఫర్నీచర్ ను వెలగపూడికి సంబంధిత అధికారులు తరలించారు. వచ్చే వారం పది రోజుల్లో మిగతా కార్యాలయాలకు సంబంధించిన దస్త్రాలను - కంప్యూటర్లను - ఫర్నీచర్ ను తరలించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈనెల 27వ తేదీ తర్వాత ఏపీ సచివాలయంలో ఉన్న తమ కార్యాలయాలన్నింటినీ అప్పగిస్తామని రాజీవ్ శర్మకు ఏపీ ప్రభుత్వం లేఖ రాయడంతో తమకు కార్యాలయాల కొరత తీరుతుందన్న ఆశాభావంతో సచివాలయ అధికారులు ఉన్నారు. ఇప్పటికిప్పుడు తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశాలు లేనందున ఏపీ ప్రభుత్వం ఖాళీ చేసే కార్యాలయాల్లోకి తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి ఆ ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తోంది.
ఏపీ సచివాలయంలోని జే బ్లాకులో ఎనిమిది అంతస్తులు ఉండగా, ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ లో సమావేశ మందిరం ఉంది. ఈ మందిరాన్ని ఉన్నతస్థాయి సమావేశాలకు - సమీక్షలకు ఉపయోగించుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు - ప్రత్తిపాటి పుల్లారావు - పీతల సుజాత - అచ్చెన్నాయుడు - ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి - పరిటాల సునీత - మాణిక్యాలరావు - కొల్లు రవీంద్ర - బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తదితరుల కార్యాలయాలు ఈ బ్లాకులోనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మంత్రులు కొంతమంది తమ కార్యాలయాలను ఈ బ్లాకులోకి మార్చుకునేందుకు ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నారు. తెలంగాణ చేతిలో ఉన్న డీ బ్లాకులో ఉన్న తెలంగాణ మంత్రుల కార్యాలయాలు ఇరుకిరుకుగా ఉండడం, శాఖాపరమైన సమావే శాలు - సమీక్షలు నిర్వహించుకోవాలంటే సచివాలయంలో కార్యాలయాలు అందుబాటులో లేకపోవడంతో కొందరు మంత్రులు జూబ్లీహిల్స్ లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలోని కార్యాలయాల్లో వీటిని నిర్వహిస్తూ వస్తున్నారు. కొంతమంది మంత్రులు హైటెక్స్ లోని సమావేశ మందిరాల్లో శాఖాపరమైన సమీక్షలు జరుపుతున్నారు. మరికొంతమంది దూర ప్రాంతాలకు వెళ్లే ఓపిక - సమయం లేక డీ బ్లాకులోని మూడవ అంతస్తులో ఉన్న ఆర్థిక శాఖ సమావేశమందిరంలో రోజువారీ సమీక్షలను కొనసాగిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇలా ఇబ్బందులు పడుతున్న తెలంగాణ మంత్రులంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. కొందరు మంత్రులు ఇప్పటికే తమ కార్యాలయాలను సౌత్ హెచ్ బ్లాక్ - నార్త్ హెచ్ బ్లాకు - జే బ్లాకులకు తరలించేందుకు సన్నాహాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
అయితే.. ఎల్ బ్లాకును మాత్రం చివరి నిమిషం వరకు తమ వద్దే అట్టిపెట్టుకోవాలని ఏపీ ప్రభుత్వం అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే పదేళ్ల వరకు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం రాజధాని కావడంతో ఏపీ సచివాలయంలోని ఎల్ బ్లాకును అప్పటిదాకా తమ పరిధిలోనే ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం. అప్పుడప్పుడు కీలకమైన సమావేశాలను హైదరాబాద్ లోనే నిర్వహించాలన్న ప్రతిపాదనకు ఆయన వచ్చినట్టు తెలుస్తోంది. ఈ బ్లాకులోని ఏడు - ఎనిమిది అంతస్తుల్లో సీఎం చంద్రబాబు కార్యాలయం ఉంది. మరో రెండు - మూడేళ్ల పాటు కొన్ని కీలకమైన కార్యాలయాలను హైదరాబాద్ లోనే కొనసాగించాలని నిర్ణయించినందున ఎల్ బ్లాకునంతా పదేళ్ల వరకు తమ ఆధీనంలోనే ఉంచుకోవాలని ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఒక్క ఎల్ బ్లాకు మినహా మిగతా అంతా కూడా తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడానికి ఇంకా కొద్దిరోజులే సమయం ఉంది.