Begin typing your search above and press return to search.
తెలంగాణ అమరవీరుల లెక్క ఇప్పటికి 588
By: Tupaki Desk | 16 March 2016 7:13 AM GMTతెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో ఎందరో యువకులు తమ ప్రాణాలు తీసుకున్నారు. తమను తాము ఆత్మార్పాణం చేసుకుంటే తెలంగాణ వస్తుందని నమ్మి ప్రాణం విడిచిన వారున్నారు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తరచూ ఇలాంటి వార్తల్ని వినే వాళ్లం. అంతేకాదు.. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ ఎస్) నేతలతోపాటు.. తెలంగాణ ఐకాస నేతలైన ప్రొఫెసర్ కోదండరాం మాష్టారు లాంటి వాళ్లు పదిహేను వందల మంది.. 1800 మంది అంటూ నిత్యం చెబుతుండే వారు.
వేలాది మంది ప్రాణాలు తీసుకుంటున్నా.. ఢిల్లీలోని సోనియమ్మ చలించరా? అంటూ విమర్శలు చేసే వారు. కారణాలు ఏమైనా కానీ.. అందరి ఆకాంక్షలు తీరుస్తూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఏర్పాటుతో.. తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన ఉద్యమ వీరులను ఘనంగా సంస్మరించుకొని.. వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రక్షగా ఉండాలని నిర్ణయించారు.
ఇలాంటి మాటలు విన్నప్పుడు.. తమ బిడ్డల్ని పోగొట్టుకున్న వేలాదిమంది తల్లిదండ్రులకు.. ఊరట కలిగేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశించారు. అయితే.. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై 22 నెలలు పూర్తి అవుతున్నా.. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు తీసుకున్న అమరవీరుల్లో ప్రభుత్వం గుర్తించి.. ఆర్థిక సాయం అందిన వారి అంకె చూస్తే అవాక్కు కావటం ఖాయం. తాజాగా 29 మంది అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు వీలుగా జీవో జారీ చేశారు.
తాజాగా విడుదల చేసిన జీవోతో ఇప్పటివరకూ తెలంగాణ అమరవీరులుగా గుర్తించి ప్రభుత్వ సాయాన్ని అందించిన వారి సంఖ్య 588కు చేరుకుంది. ఉద్యమ సమయంలో వేలాది మంది అంకెల్ని చెప్పినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమరవీరులుగా గుర్తించి సాయం అందింది 588 కుటుంబాలకు మాత్రమే కావటంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అమరవీరుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరింత చురుగ్గా వ్యవహరించి.. ఉద్యమ సమయంలో చెప్పినట్లుగా వేలాది మందికి సాయం చేసి.. ఆయా కుటుంబాలకు తెలంగాణ సర్కారు దన్నుగా నిలవాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.
ఇక జిల్లాల వారీగా గుర్తించిన అమరవీరుల్ని చూస్తే.. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 186 మంది.. ఆ తర్వాతి స్థానంలో వరంగల్ లో 118 మంది.. నల్గొండలో 64.. మెదక్ 58.. నిజామాబాద్ 50.. రంగారెడ్డిలో 37.. హైదరాబాద్ లో 22.. మహబూబ్ నగర్ లో 21.. ఖమ్మంలో ఐదుగురిగా గుర్తించారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న మిగిలిన వారిని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.