Begin typing your search above and press return to search.
తెలుగు రాష్ట్రాల మధ్య ‘ఎత్తిపోతల’ వార్
By: Tupaki Desk | 27 Sep 2015 7:00 AM GMTఇప్పటికే ఉన్న పంచాయితీలు చాలవన్నట్లు సరికొత్త పంచాయితీ తెరపైకి వచ్చింది. విభజన నేపథ్యంలో పలు అంశాల మీద నడుస్తున్న పంచాయితీలు ఒక కొలిక్కి రాని వైనం తెలిసిందే. ఇవి చాలవన్నట్లు కొత్త.. కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా అలాంటిదే మరో సమస్య వచ్చింది.
రికార్డు సమయంలో పట్టిసీమ సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఏపీ సర్కారు.. తాను అనుకుంటే ఏమైనా చేయగలనన్న విషయాన్ని ఏపీ సర్కారు పట్టిసీమ ప్రాజెక్టుతో చెప్పకనే చెప్పేసింది. అయితే.. ప్రాజెక్టుపై తెలంగాణ సర్కారు గుర్రుగా ఉంది. దీనికి కారణం లేకపోలేదు. గోదావరి జలాల్ని తీసుకుపోయి కృష్ణలో కలుపుకోవటం అంటే.. గోదావరిలో తమకు వచ్చే వాటాను కొల్లగొట్టటంగా తెలంగాణ సర్కారు వాదిస్తోంది.
తన వాదనను వినిపించటమే కాదు.. ఏపీ సర్కారుకు తాజాగా ఒక లేఖాస్త్రాన్ని సంధించింది. పట్టిసీమ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని కోరుతోంది. తెలంగాణ వాదనను విన్నప్పుడు సమంజసంగా అనిపించినప్పటికీ.. ఏపీ వాదన వింటే తల పట్టుకోవాల్సిందే. ఎందుకంటే.. గోదావరి.. కృష్ణా నదులపై తెలంగాణ సర్కారు నిర్మించాలని తలపోస్తున్న వివిధ ఎత్తిపోతల పథకాల్ని ఎత్తి చూపిస్తూ.. పట్టిసీమపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వారు.. తెలంగాణ ప్రాజెక్టుల మాటేమిటని ప్రశ్నిస్తున్నారు.
పట్టిసీమకు సంబంధించి గోదావరి నదీ జలాలలో వాటాలు అడుగుతున్న తెలంగాణ సర్కారు.. ఆ రాష్ట్రం నిర్మించే ఎత్తిపోతల ప్రాజెక్టులకు పట్టిసీమ నిబంధనే వర్తిస్తుందా? అని ప్రశ్నించాలని సిద్ధమవుతున్న తెలుస్తోంది. మరి.. ఈ వివాదం రెండు రాష్ట్ర అధికారుల మధ్య చర్చలతో పూర్తి అవుతుందా? లేక.. పంచాయితీల వరకూ వెళుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి.