Begin typing your search above and press return to search.
ఈ దెబ్బకు హెల్మట్ పెట్టుకుంటారేమో
By: Tupaki Desk | 29 Sep 2015 5:04 AM GMTపెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా విలువైన ప్రాణాలు పోవటం తెలిసిందే. తప్పు చేసిన వారితో పాటు.. వారికి ఏ మాత్రం సంబంధం లేని వారెందరో ఫలితం అనుభవిస్తున్న దుస్థితి రోడ్డు ప్రమాదాల్లో తరచూ చూస్తుంటాం. రోడ్డు ప్రమాదాల్లో మరణించే చాలామంది రోడ్డు భద్రతకు సంబంధించి ప్రమాణాలు పాటించకపోవటం.. జాగ్రత్తలు తీసుకోకపోవటం ఒక కారణం.
రోడ్డు ప్రమాదాల్ని నివారించే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. వాహనదారులు హెల్మెట్ ధరించకుంటే రవాణా శాఖ కార్యాలయంలోకి అనుమతించని విధంగానే.. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోయటాన్ని కూడా అడ్డుకోవాలన్న నిర్ణయాన్ని తీసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారు. ఇదొక్కటే కాదు.. పలు ముఖ్యమైన ప్రాంతాల్లోకి అనుమతి.. టోల్ ప్లాజా వద్ద హెల్మెట్ లేని వాహనదారులను అనుమతించకుండా ఉండాలన్న నిబంధనను విధించాలన్న ఆలోచన చేస్తున్నారు.
దీంతో పాటు.. హెల్మెట్ ధరించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారికి భారీ జరిమానాలు విధించటం ద్వారా హెల్మెట్ వినియోగాన్ని తప్పనిసరి చేయాలన్న ఆలోచనలో తెలంగాణ సర్కారు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నిర్ణయాల్ని అమలు చేసే ముందు.. ముందస్తుగా భారీ ప్రచారం చేపట్టిన తర్వాతే వీటిని అమలు చేయాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. ఇలాంటి నిర్ణయాల్ని ఏపీ సర్కారు కూడా అమలు చేస్తే బాగుంటుంది.