Begin typing your search above and press return to search.
సానియా- తెలంగాణ సర్కారు ఓ చేదు నిజం
By: Tupaki Desk | 12 July 2015 10:28 PM GMTకొన్ని అంశాలు అబద్దం అని పదేపదే వివరణ ఇచ్చినా...ఆ క్రమంలో జరిగే పనులు వాటి తాలుకు అసలు సంగతిని బయటపెడుతుంటాయి. రాజకీయాల్లో ఈ విషయాలు సాధారణమే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ రాష్ర్ట బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జాను నియమించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమె పలు టోర్నీలు గెలిచిన సందర్భాల్లో రెండు కోట్ల రూపాయలు ప్రైజ్ మనీగా ప్రకటించి అందజేశారు. తాజాగా వింబుల్డన్ డబుల్స్‌లో సానియా విజయం సాధించారు. భారత దేశం నుంచే ఈ ఘనత సాధించిన క్రీడాకారిణి అనే ఘనత సానియా సొంతం చేసుకున్నారు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి రివార్డును ప్రకటించలేదు.
రూ.కోటి లేదా రెండు కోట్ల రివార్డును కేసీఆర్ ప్రకటిస్తారని పలు వర్గాలు భావించాయి. కానీ రెండు కారణాల వల్ల ఈ ఆలోచన కార్యరూపం దాల్చలేదని తెలుస్తోంది. మొదటిది తెలంగాణ రాష్ర్టం ఆర్థిక కష్టాల్లో ఉందనే వార్తల. ఈ వార్తలు వెలువడిన సమయంలో పలువురు అధికార పార్టీ నాయకులు ఖండించారు. కానీ...అలాంటి పరిస్థితి వల్లే సానియాకు రివార్డు ప్రకటించలేదనే భావన ఉంది.
దీంతో పాటు ప్రతి టోర్నీ సందర్భంలోనూ రివార్డు ఇస్తే నెగెటివ్ మెసేజ్ వెళుతుందని కూడా వెనక్కు తగ్గినట్లు సమాచారం. అయితే ఏదిఏమైనా వింబుల్డన్ వంటి అంతర్జాతీయ ఖ్యాతీ గల టోర్నీ గెలుచుకున్నపుడు రివార్డ్ ఇవ్వకపోవడం...తెలంగాణ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.