Begin typing your search above and press return to search.
సంపన్న రాష్ట్రంలో 5వేల కోట్ల బిల్లులు ఆపేశారా?
By: Tupaki Desk | 27 Jun 2016 5:30 AM GMTవినటానికే విచిత్రంగా అనిపించినా ఇది నిజమని చెబుతున్నారు. సంపన్న రాష్ట్రంలో గొప్పలు చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో దాదాపు రూ.5వేల కోట్లకు పైగా కాంట్రాక్ట్ బిల్లుల్ని చెల్లించకుండా ఆపేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిధుల కొరత అంటూ లేదని తరచూ చెప్పే దానికి భిన్నంగా బిల్లుల చెల్లింపులు చేపట్టకుండా పెండింగ్ లో ఉంచటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కొద్దిరోజుల కిందటే దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తమ రాష్ట్రం 27.45 శాతం ఆదాయ వృద్ధిని సాధించిందని.. ఇది అద్భుతమైన పురోగతిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభివర్ణించటం తలిసిందే. గత ఏడాది ఏప్రిల్.. మే లతో పోల్చినప్పుడు ఈ ఏడాది అదేరెండు నెలల్లో రాష్ట్ర ఆదాయం ఏకంగా రూ.1656 కోట్లకు పెరిగిన వైనం విన్నప్పుడు తెలంగాణ వాదులందరికి హుషారు కలిగించింది.
ఇంతటి సానుకూల వాతావరణం ఉన్నప్పుడు.. బిల్లుల చెల్లింపుల్ని నిలిపివేయటం ఏమిటన్న డౌట్ రావొచ్చు. అసలు అలాంటి పరిస్థితి రావాల్సిన అవసరం ఉందా? అన్న సందేహం కలగొచ్చు. కానీ.. అలాంటి పరిస్థితే ప్రస్తుతం చోటుచేసుకోవటం గమనార్హం. ఎందుకిలా అన్న ప్రశ్నకు సమాధానం వెతికే.. ప్రభుత్వం వ్యవహరించిన తీరే కారణంగా చెప్పాలి. ఆదాయానికి మించిన అంచనాల్ని పెట్టుకోవటం.. అందుకు తగ్గట్లే ఖర్చుల్ని ప్లాన్ చేయటమే అసలు ఇబ్బందిగా చెప్పాలి.
దీనికో ఉదాహరణ చెప్పాలంటే 2016 – 17 లో స్టేట్ ఓన్ టాక్స్ రెవెన్యూ ద్వారా రూ.54,869 కోట్ల ఆదాయం వస్తుందని లెక్కలేసుకున్నారు. కానీ.. ఇదే ఏడాది సవరించిన బడ్జెట్ ప్రకారం రూ.43,535 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. కానీ.. వాస్తవ లెక్కల ప్రకారం వచ్చిన ఆదాయం రూ.41వేల కోట్లు దాటలేదని చెబుతున్నారు. ఇలాంటి అంతరాలే తాజా సమస్యకు కారణమంటున్నారు. ఏ నెలకు ఆ నెల ఆదాయం భారీగా పెరుగుతున్నా.. ఖర్చులు కూడా అదే తీరులో పెరిగిపోవటం ఒక సమస్యగా మారిందని చెప్పాలి. గత ఏడాదితో పోలుస్తూ ఈ ఏడాది ఖర్చును చూస్తే.. ఒక్క సాగునీటి ప్రాజెక్టుల కోసమే ప్రతి నెలా రూ.2వేల కోట్లు కేటాయించటం గమనార్హం. ఇవి కాకుండా..మరికొన్ని సంక్షేమ కార్యక్రమాల మీద భారీగా ఖర్చుచేయటం కూడా లోటుకు కారణంగా చెప్పాలి.
అందుకే ఈ లోటును పూడ్చుకోవటానికి గడిచిన మూడు నెలల్లో రాష్ట్ర అభివృద్ధి రుణం పేరిట బాండ్లను అమ్మి రూ.3500 కోట్ల అప్పును తీసుకొచ్చారు. మరో రూ.1500 కోట్లను కూడా సేకరించినట్లుగా తెలుస్తోంది. ఆదాయానికి ఖర్చుకు మధ్య అంతరం భారీగా పెరగటంతో రైతులకు ఇవ్వాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ చెల్లింపులు.. ప్రభుత్వ ఉద్యోగులు.. పెన్షనర్లకు జులైలో పెంచాల్సి డీఏ.. తొమ్మిది నెలల పీఆర్సీ బకాయిల్ని ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. మరో వైపు నెల రోజులుగా పనులకు విడుదల చేయాల్సిన బిల్లుల్ని నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. ఆదాయం విషయంలో సానుకూల వాతావరణం ఉన్నా.. అంతకంతకూ పెరుగుతున్న ఖర్చుతోనే అసలు ఇబ్బందని.. ఖర్చును వీలైనంత తగ్గించుకోవటమే ఇప్పుడున్న సమస్యలకు సరైన పరిష్కారంగా చెబుతున్నారు. ఇలాంటి మాటలు సంపన్న సీఎం కేసీఆర్ కు నచ్చే అవకాశం ఉందా..?