Begin typing your search above and press return to search.
జీఎస్టీపై టీ సర్కార్ అసంతృప్తి!
By: Tupaki Desk | 14 Jun 2017 1:02 PM GMTజీఎస్టీ అమలు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ ప్రభుత్వంలో అంతర్మథనం మొదలైంది. జీఎస్టీ బిల్లుకు అనవసరంగా ఆమోదం తెలిపామా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి జీఎస్టీ బిల్లును టీ సర్కార్ ఆమోదించిన సంగతి తెలిసిందే.
అయితే, కేంద్రం నిర్ణయాలతో టీ సర్కా ర్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో, జీఎస్టీపై కేసీఆర్ సర్కార్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమల్లోకి రావడం హర్షణీయమని కేసీఆర్ అప్పట్లో ప్రకటనలు చేశారు.
జూలై 1నుంచి జీఎస్టీని అమల్లోకి తీసుకు వచ్చేందుకు జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. వివిధ రకాల పన్నుల శ్లాబులను ఖరారు చేస్తోంది. అందులో పలు అంశాలపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
34అంశాలపై చేసిన జీఎస్టీ శ్లాబులు తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. వీటిని మార్చాలని తెలంగాణ ప్రభుత్వం జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కోరింది. అయితే వీటిలో రెండు అంశాలను మాత్రమే కౌన్సిల్ ఆమోదించింది. దీంతో జీఎస్టీ విషయంలో టీ సర్కార్ దిక్కు తోచని పరిస్థితిలో పడింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/