Begin typing your search above and press return to search.

ఆధార్‌..రోజులో వెయ్యి సార్లు వాడేస్తున్నార‌ట‌!

By:  Tupaki Desk   |   2 Aug 2018 7:42 AM GMT
ఆధార్‌..రోజులో వెయ్యి సార్లు వాడేస్తున్నార‌ట‌!
X
తెలంగాణ రాష్ట్రంలోని రెవెన్యూ అధికారులు కొంద‌రి తీరు ఆధార్ కు కీల‌క‌మైన యూఐడీఏఐ సంస్థ హాహాకారాలు చేస్తోంది. ఆధార్ తో పలు ప్ర‌భుత్వ ప‌థ‌కాల అనుసంధానానికి సంబంధించి www.uidai.gov.in అనే వెబ్ సైట్ లోకి తెలంగాణ‌కు చెందిన ప‌లువురు రెవెన్యూ అధికారుల‌కు యాక్సిస్ చేసే అవ‌కాశాన్ని క‌ల్పించారు. సైట్ లోకి యాక్సిస్ చేసేందుకు వీలుగా త‌హ‌సీల్దార్ల‌కు.. కొద్దిమంది అధికారుల‌కు ఇచ్చారు.

అయితే.. ఇటీవ‌ల కాలంలో కొద్ది మంది అధికారులైతే.. రోజులో వెయ్యిసార్లు వెబ్ సైట్లోకి వెళ్లి వ‌స్తున్నార‌ట‌. ఈ స్థాయిలో వాడ‌కంపై కేంద్రంలోని ప్రాధికార సంస్థ‌కు చెందిన అధికారులు షాక్ తింటున్నార‌ట‌.ఇంత భారీగా వాడేయ‌టం ద్వారా ఆధార్ గోప్య‌త ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

తెలంగాణ‌కు చెందిన 586 మంది త‌హ‌సీల్దార్ల‌కు.. ఆర్డీవోల‌కు ఆధార్ వెబ్ సైట్ లోకి వెళ్ల‌కుండా యూఐడీఏఐ నియంత్ర‌ణ విధించింది. మ‌రీ.. ఇంత తీవ్ర‌స్థాయిలో వాడేయ‌టం ఏమిటంటూ.. మండిప‌డుతున్నారు. ఒక ఐఏఎస్ అధికారిని పిలిపించి చీవాట్లు పెట్టిన‌ట్లుగా చెబుతున్నారు.

ఆధార్ వాడ‌కానికి సంబంధించిన యాక్సిస్ రెండు రోజుల పాటు నియంత్రించి.. తాజాగా మ‌ళ్లీ ఇచ్చారు. ప‌ట్టాదార్ పాస్ పుస్త‌కాలలో మార్పులు మొద‌లు.. భూరికార్డుల న‌వీక‌ర‌ణ స‌ర్టిఫికేట్ల జారీకి ఆధార్ ను ప్రామాణికంగా చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో వాడ‌కం విప‌రీతంగా ఉంది. అయితే.. ఇంత భారీగా ఉప‌యోగించ‌టం వ‌ల్ల ఆధార్ గోప్య‌త ప్ర‌మాదంలో ప‌డుతుంద‌న్న భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆధార్ యాక్సిస్ ను ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హించాల‌న్న సూచ‌న‌ను చేసింది.

తెలంగాణ‌లో ప్ర‌జ‌ల కంటే ఎక్కువ‌గా ఆధార్ కార్డులు జారీ అయిన‌ట్లుగా అనుమానిస్తున్నారు. అధికారిక లెక్క‌ల ప్ర‌కారం తెలంగాణ‌లో 3,84,72,769 మంది జ‌నాభా ఉండ‌గా.. ఆధార్ లు మాత్రం ఏకంగా 3,86,36,890 ఉన్న‌ట్లు తేల్చారు. జ‌నాభా కంటే ఎక్కువ‌గా ఉన్న ఆధార్ ల‌ను లెక్క‌ల తేల్చ‌టంతో పాటు.. అక్ర‌మంగా ఉన్న వారి విష‌యంలో చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు తెలుస్తోంది.